iPhone 15 Pro : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 15 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఐఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

iPhone 15 Pro : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 15 Pro can be yours at Rs 6k discount on Amazon, here is how the deal works

iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఐఫోన్ ధర ఎక్కువని చాలామంది ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. మీరు కొంతకాలంగా ఐఫోన్ 15 ప్రో కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇదే సరైన అవకాశం. ఈ ఐఫోన్ అమెజాన్‌లో స్పెషల్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. మీరు రూ. 6వేల కన్నా ఎక్కువగానే డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఐఫోన్ 15 ప్రో మొత్తం 4 స్టోరేజ్ వేరియంట్‌లతో వచ్చింది. 128జీబీ వేరియంట్ ధర రూ.1,34,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.1,44,900, 512జీబీ వేరియంట్ ధర రూ.1,64,900 కాగా, 1టీబీ వేరియంట్ ధర రూ.1,84,900గా ఉంది. అయితే ఈ ఐఫోన్లను అమెజాన్‌లో ప్రత్యేక ధరలకు అందిస్తోంది. అంతేకాదు.. ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

అమెజాన్‌లో ఐఫోన్ 15 ప్రో స్పెషల్ డీల్ :
ఐఫోన్ 15 ప్రో 128జీబీ వేరియంట్ ప్రస్తుతం రూ. 1,27,990 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ రూ.6,910 డైరెక్ట్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.3వేల డిస్కౌంట్ కూడా ఉంది. ఐఫోన్‌పై మొత్తం రూ.9,910 వరకు తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా, ఐఫోన్ 256జీబీ వేరియంట్ రూ. 1,37,990 ధరకు లభిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 3వేల తగ్గింపును పొందవచ్చు.

ఐఫోన్ 15 ప్రో స్పెషిఫికేషన్లు ఇవే :
ఐఫోన్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం అనే 4 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. స్పెషిషికేషన్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 15 ప్రో గ్రేడ్ 5 టైటానియం బాడీని కలిగి ఉంది. బరువు తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ అదనపు ప్రొటెక్షన్ లేయర్ సిరామిక్ షీల్డ్ ఉంది. ఈ ఫోన్ అంచులు గుండ్రంగా, మృదువుగా ఉంటాయి. గత ఏడాది ప్రో మోడల్‌ల మాదిరిగానే ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ నాచ్‌ను కలిగి ఉంది. ఆపిల్ సాధారణ మ్యూట్ బటన్‌కు బదులుగా యాక్షన్ బటన్‌ను కూడా ప్రవేశపెట్టింది.

కెమెరా విషయానికి వస్తే.. :
ఐఫోన్ 15 ప్రో A17 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఐఫోన్ 15 ప్రో హైరిజల్యూషన్ ఫొటోలను అందించగలదు. 48ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 24ఎమ్ఎమ్, 28ఎమ్ఎమ్, 35ఎమ్ఎమ్ అనే 3 ఫోకల్ లెంగ్త్‌ల మధ్య మారవచ్చు. కొత్త డిఫాల్ట్‌గా కూడా ఎంచుకోవచ్చు. ప్రైమరీ కెమెరాలో 3ఎక్స్ టెలిఫోటో కెమెరా ఉంది. బ్యాటరీ పరంగా.. ఐఫోన్ 15 ప్రో రోజంతా ఛార్జింగ్ వస్తుందని ఆపిల్ పేర్కొంది. ఇతర ఫోన్‌ల మాదిరిగానే టైప్-సి యూఎస్‌బీ పోర్ట్ ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.

Read Also : iPhone 17 Launch : అద్భుతమైన డిస్‌ప్లేతో ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ వచ్చేస్తోంది.. అచ్చం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మాదిరిగానే..!