My Home Akrida : హైదరాబాద్‎లో మరో టాలెస్ట్ టవర్.. 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్‌ అక్రిదా

My Home Akrida : తెల్లాపూర్‌లోని టెక్నోసిటీలో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్‌ అక్రిదాను డెవలప్‌ చేస్తోంది. 81 శాతం ఓపెన్‌ ఏరియాతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ డిజైన్‌ చేశారు. ఇందులో మెుత్తం 12  హైరైజ్‌ టవర్స్‌ను నిర్మించనున్నారు.

Tellapur My Home Akrida new Launch Under Construction Projects in Hyderabad ( Image Source : Google )

My Home Akrida : తెలంగాణలో అత్యంత విశ్వసనీయమైన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీగా పేరున్న మై హోమ్‌ గ్రూప్‌ నుంచి మరో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ రాబోతోంది. తెల్లాపూర్‌లోని టెక్నోసిటీలో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్‌ అక్రిదాను డెవలప్‌ చేస్తోంది. 81 శాతం ఓపెన్‌ ఏరియాతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ డిజైన్‌ చేశారు. ఇందులో మెుత్తం 12  హైరైజ్‌ టవర్స్‌ను నిర్మించనున్నారు.

G ప్లస్‌ 39 అంతస్తుల్లో మొత్తం 3 వేల 780 ప్రీమియం ఫ్లాట్లను అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో 2 BHK, 2.5, 3 BHK ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. 2 BHK ఫ్లాట్లను 13 వందల 99 ఎస్‌ఎఫ్‌టీల్లో.. 2.5 బీహెచ్‌కేను 16 వందల 22 ఎస్‌ఎఫ్‌టీల్లో నిర్మిస్తున్నారు. ఇక 3 BHK ఫ్లాట్స్‌ను మొత్తం 4 విస్తీర్ణాల్లో డెవలప్‌ చేస్తున్నారు. 1926, 2012, 2262, 2347 ఎస్‌ఎఫ్‌టీల్లో 3 BHK ఫ్లాట్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రాపర్టీలన్నీ ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌ ఫేసింగ్‌తో ఉంటాయి.

Read Also : Dream Home : హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఇళ్ల ధరలు.. సొంత ఇల్లుకు రూ. కోటి కావాల్సిందే..!

స్పెసిఫిక్‌ ఎమినిటీస్‌ విషయానికి వస్తే ప్రతి టవర్‌లో డబుల్‌ హైట్‌ ఎంట్రన్స్‌ లాబీ ఉంటుంది. నివసించే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాలుగు బేస్‌మెంట్లలో కార్‌ పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. బ్యూటీఫుల్‌ క్రాఫ్టెడ్‌ ల్యాండ్‌స్కేప్‌ హైలైట్‌గా చెప్పొచ్చు. రెండు క్లబ్‌ హౌస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి  క్లబ్‌ హౌస్‌ G ప్లస్‌ 4 ఫ్లోర్స్‌లో 58 వేల ఎస్‌ఎఫ్‌టీలో డెవలప్‌ చేయనున్నారు. రెండో క్లబ్‌  హౌస్‌ను G ప్లస్‌ త్రీఫ్లోర్స్‌లో 47వేల ఎస్‌ఎఫ్‌టీలో అభివృద్ధి చేయనుంది మైహోమ్‌ గ్రూప్‌.

అవుట్‌డోర్‌ జిమ్‌, కిడ్స్‌ ప్లే ఏరియా, టెన్నిస్‌ కోర్టులు, సీటింగ్‌ జోన్‌, స్విమ్మింగ్‌ పూల్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టు, బాక్స్‌ క్రికెట్‌, యాంపి థియేటర్‌, పెట్‌ జోన్‌, క్రికెట్‌ ప్రాక్టీస్‌ నెట్స్‌, లాన్స్‌, స్కైవాక్‌, జాగింగ్‌ అండ్‌ వాకింగ్‌ ట్రాక్‌లతో పాటు సైక్లింగ్‌ ట్రాక్‌, స్కేటింగ్‌ రింక్‌, గ్రాండ్‌ లాబీ, జిమ్‌, మల్టీపర్పస్‌ హాల్స్‌ ఉంటాయి. మరోవైపు యోగ-మెడిటేషన్‌, ఏరోబిక్‌ హాల్స్‌, రీడింగ్‌ ఏరియా, గెస్ట్‌ రూమ్స్‌, ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇండోర్‌ గేమ్స్‌, స్క్వాష్‌ కోర్టులు, కన్వీనియన్స్‌ స్టోర్‌, ఫార్మసీ, ఏటీఎం, బ్యాంక్‌, ఎస్‌అండ్‌బీ, స్పా అండ్‌ సెలూన్‌, గ్యాస్‌ బ్యాంక్స్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌ యార్డ్‌తో ఇతర ఎమినిటీస్‌ను సంస్థ అందిస్తోంది.

మైహోమ్‌ అక్రిదా నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయం :
మైహోమ్‌ అక్రిదా నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయం అందుబాటులో ఉంది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఓల్డ్‌ ముంబై హైవేకు కూతవేటు దూరంలోనే ప్రాజెక్ట్‌ డెవలప్‌ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి 10 నిమిషాల్లోనే సమీపంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌, టాప్‌ హాస్పిటల్స్‌, మాల్స్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. 35 నిమిషాల్లో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ప్రాజెక్ట్‌ నుంచి వెళ్లొచ్చు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు దగ్గర్లోనే ఉన్నాయి. కేవలం 2 నిమిషాల్లోనే స్కూల్స్‌కు వెళ్లే విధంగా ప్రాజెక్ట్‌ అందుబాటులో ఉంది.

800X800 మిల్లీమీటర్ల సైజుతో వర్టిఫైడ్‌ టైల్స్‌ : 
ప్రాజెక్ట్‌ స్పెసిఫికేషన్స్‌లో RCC షేర్‌ వాల్‌ ఫ్రేమ్డ్‌ స్ట్రక్చర్‌, భూకంపాలను తట్టుకునేలా సూపర్‌ స్ట్రక్చర్‌తో పటిష్టమైన నిర్మాణాలను చేపడుతోంది మై హోమ్‌ గ్రూప్‌. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ వాల్‌, సీలింగ్‌ను నిర్మిస్తున్నారు. డ్రాయింగ్‌, డైనింగ్‌, బెడ్‌రూమ్‌, లివింగ్‌ రూమ్‌, కిచెన్‌, బాల్కనీ వాల్స్‌, సీలింగ్‌ను పేరున్న బ్రాండ్స్‌తో పుట్టి, కలర్‌తో అత్యంత స్మూత్‌గా ఫినిషింగ్‌ చేస్తున్నారు. ఈ గదుల్లో  800x 800 మిల్లీమీటర్ల సైజుతో వర్టిఫైడ్‌ టైల్స్‌ ఉంటాయి. బాత్‌రూముల్లో గ్రిడ్‌ సీలింగ్‌, జీవీటీ లేదా సెరామిక్‌ టైల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు . అల్యూమినియం అలాయ్‌, UPVC గ్లేజ్డ్‌ స్లైడింగ్‌, EPDM గాస్కెట్స్‌తో ఓపెన్‌ ఏబుల్‌ షటర్స్‌, మస్కిటో మెష్‌ను విండోస్‌, గ్రిల్స్‌కు ఏర్పాటు చేయనున్నారు.

మెయిన్‌ డోర్‌ హార్డ్‌వుడ్‌ ఫ్రేమ్స్‌తో ఉంటుంది. రెండు వైపులా మెలమిన్‌ స్ప్రే పాలిష్‌తో ఫినిషింగ్‌ చేస్తారు. ఇంటర్నల్‌ కూడా హార్డ్‌వుడ్‌ ఫ్రేమ్స్‌ లేదా ఫ్యాక్టరీ మేడ్‌ వుడెన్‌ ఫ్రేమ్‌తో రూపొందిస్తున్నారు. డోర్స్‌కు రెండు వైపులా లామినేటెడ్‌ ఫ్లష్‌ షటర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. బాత్‌రూమ్స్‌, యుటిలిటీ డోర్స్‌ను గ్రానైట్‌  ఫ్రేమ్స్‌తో ఉంటాయి. కిచెన్‌లో సింగిల్‌ బౌల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ సింక్‌తో గ్రానైట్‌ ప్లాట్‌ఫామ్‌ ఉంటుంది. ఇందులో వాటర్‌ ప్యూరిఫైయర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఫ్లాట్స్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వంటివి జరగకుండా ఉండేందుకు నాణ్యమైన ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ ఉపయోగిస్తున్నారు. ఎక్కువ లోడ్‌ను తట్టుకునేలా కాపర్‌ వైరింగ్‌ ఉంటుంది. అన్ని బెడ్‌రూమ్స్‌ అండ్‌ లివింగ్‌ రూమ్స్‌లో ఏసీల కోసం పవర్‌ అవుట్‌లెట్‌లు సిద్ధం చేస్తున్నారు. గీజర్లు, వంటగదిలో చిమ్నీ, హాబ్‌, రిఫ్రిజిరేటర్‌, మైక్రోవేవ్‌ ఓవెన్‌, మిక్సర్‌ లేదా గ్రైండర్‌ కోసం పవర్‌ అవుట్‌లెట్‌లు ఏర్పాటు  చేయనున్నారు.వాషింగ్‌ మెషిన్‌ కోసం యుటిలిటీ ప్లేస్‌లో కూడా పవర్‌ అవుట్‌లెట్‌ ఉంటుంది. ప్రతి యూనిట్‌కు వ్యక్తిగత మీటర్లతో త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఫ్లాట్‌లో అంతర్జాతీయ స్టాండర్ట్స్‌తో మాడ్యులర్‌ స్విచ్‌లు కూడా ఉంటాయి. వాటర్‌ లేకీజీ లేకుండా టెక్నాలజీని వినియోగిస్తున్నారు. బాత్‌రూమ్‌, బాల్కానీ, యుటిలిటీ ఏరియా, రూఫ్‌ టెర్రస్‌పై వాటర్‌ ప్రూఫింగ్‌ ఉంటుంది.

మైహోమ్‌ అక్రిదా ప్రాజెక్ట్‌లో భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. 24 గంటల సెక్యూరిటీ ఉంటుంది. ప్రాజెక్ట్‌లోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఫైర్‌ అలారమ్‌, ఆటోమేటిక్‌ స్ప్రింకర్స్‌తో పాటు అగ్ని మాపక శాఖ గైడ్‌లైన్స్‌ ప్రకారం అన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో హండ్రెడ్‌ పర్సెంట్‌ పవర్‌ బ్యాకప్‌ ఉంటుంది. ఎల్‌పీజీ, పీఎన్‌పీ పైప్‌లైన్‌ను ప్రతి ఫ్లాట్‌కు అందిస్తారు. విశాలమైన కారు పార్కింగ్‌ ఉండేలా ప్రాజెక్ట్‌ సిద్ధం చేశారు. నాలుగు బేస్‌మెంట్లలో పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది. ప్రాపర్టీ విలువలో 10శాతం డబ్బును చెల్లించగానే కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌ను అలాట్‌ చేస్తారు. మై హోమ్‌ అక్రిదాలో ప్రాపర్టీని బుక్‌ చేసుకోవాలంటే అడ్వాన్స్‌ పేమెంట్‌ కింద రెండున్నర లక్షల రూపాయలను చెల్లించాలి. బుకింగ్‌ చేసుకున్న 30 రోజుల్లోగా అడ్వాన్స్‌తో కలిపి ప్రాపర్టీ విలువలో 10 శాతం డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Dream Home : భవిష్యత్‌కు భరోసా.. సొంతింటి కలపై హైదరాబాద్ వాసుల దృష్టి

ట్రెండింగ్ వార్తలు