Dream Home : భవిష్యత్‌కు భరోసా.. సొంతింటి కలపై హైదరాబాద్ వాసుల దృష్టి

Dream Home : ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ సెంటర్‌తో పాటు నగరం నలుమూలలా శరవేగంగా కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. 

Dream Home : భవిష్యత్‌కు భరోసా.. సొంతింటి కలపై హైదరాబాద్ వాసుల దృష్టి

Dream Home _ Buy House with EMI

Updated On : August 3, 2024 / 9:36 PM IST

Dream Home : సొంతిళ్లు… ఇది ప్రతి ఒక్కరి కల. లైఫ్‌లో సెటిల్ అయ్యామంటే చాలు… చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో సొంతిల్లు అనేది అత్యంత ప్రధాన్యమైన అంశంగా మారింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రాపర్టీలకు డిమాండ్‌ పెరగడంతో నిర్మాణ రంగం కూడా అంతే స్థాయిలో వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ సెంటర్‌తో పాటు నగరం నలుమూలలా శరవేగంగా కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.

Read Also : New 5 Minute Parking Rule : కొత్త పార్కింగ్ రూల్ ఎఫెక్ట్.. ఏకంగా రూ. 11 లక్షలు పెనాల్టీ చెల్లించిన మహిళ.. ఎక్కడంటే?

అఫర్డబుల్ హౌసింగ్‌కు సెంటర్‌గా నిలిచిన హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణాలు జోరుందుకున్నాయి. హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ నగరం బాట పడుతున్నారు. తమకు వచ్చే ఆదాయంతో పొదుపుమంత్రం పాటిస్తూ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రజలు ప్లాన్‌ చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ చేసి… బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని సొంతింటిని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు అద్దె ఇంటికి గుడ్‌బై పలుకుతున్నారు.

ఆదాయానికి అనుగుణంగా పొదుపు మంత్రం :
ఇక ప్రాజెక్టులను బట్టి కొన్ని సందర్భాల్లో 10 శాతం… మరికొన్ని సందర్భాల్లో 20 శాతం వరకు డౌన్ పేమెంట్‌తో బ్యాంకులు రుణాలిస్తున్నాయి. దీంతో తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా పొదుపు మంత్రం పాటిస్తూ సొంతింటి కలను ప్రజలు నెరవేర్చుకుంటున్నారు. మరికొంత మంది ఇన్వెస్ట్‌మెంట్‌కోసం రెండో ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇంటికి వచ్చే అద్దె మొత్తాన్ని ఈఎంఐగా చెల్లిస్తూ ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక బ్యాంకింగ్‌ రంగంలో పోటీ పెరగడంతో కొన్ని ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీకే లోన్లను ఆఫర్‌ చేస్తున్నాయి.

కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్‌ మారడంతో ప్రస్తుతం నగరంలో ఇళ్లకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి 30 నుంచి 40 కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా లే అవుట్లలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం మీద తమ ఆదాయంలో పొదుపు శాతాన్ని పెంచుకోవడమే కాకుండా ఈజీగా ఈఎంఐలు చెల్లించేవారి సంఖ్య నగరంలో భారీగా పెరుగుతోంది.

Read Also : Dream Home : తగ్గేదేలే.. సీజన్ ఏదైనా.. హైదరాబాద్‎లో తగ్గని నిర్మాణ పనులు