BYD Seal Electric Sedan : ఈ చైనీస్ ఎలక్ట్రిక్ కారుకు ఫుల్ డిమాండ్.. 8 రోజుల్లోనే 200 బుకింగ్స్.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

BYD Seal Electric Sedan : భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మూడో మోడల్ ఎలక్ట్రిక్ కారు అత్యధికంగా బుకింగ్స్ అందుకుంది. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు కేవలం 8 రోజుల్లోనే మొత్తం 200 బుకింగ్‌లను పొందింది.

This Chinese electric car has received 200 bookings in India in 8 days

BYD Seal Electric Sedan : ప్రముఖ చైనీస్ కార్ల తయారీ సంస్థ బీవైడీ నుంచి భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మూడో మోడల్ ఎలక్ట్రిక్ కారు అత్యధికంగా బుకింగ్స్ అందుకుంది. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు కేవలం 8 రోజుల్లోనే మొత్తం 200 బుకింగ్‌లను పొందింది.

Read Also : OnePlus 11R 5G Price : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

కంపెనీ బీవైడీ ఇ6 ఎలక్ట్రిక్ ఎంపీవీ, బీవైడీ ఆట్టో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కూడా అందిస్తోంది. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ మార్చి 5న లాంచ్ అయింది. ఈ కారు బుకింగ్‌లు వారం క్రితమే ఫిబ్రవరి 28న ప్రారంభమయ్యాయి. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ఈవీ కార్ల ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

  • డైనమిక్ – రూ. 41 లక్షలు
  • ప్రీమియం – రూ. 45.55 లక్షలు
  • పర్ఫార్మెన్స్  – రూ. 53 లక్షలు

డైనమిక్, ప్రీమియం వేరియంట్‌లు రియర్-వీల్-డ్రైవ్ (RWD) కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే, పర్ఫార్మెన్స్ వేరియంట్ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ రేంజ్ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • డైనమిక్ ఆర్‌డబ్ల్యూడీ – 510 కి.మీ
  • ప్రీమియం ఆర్‌డబ్ల్యూడీ – 650 కి.మీ
  • పర్ఫార్మెన్స్ ఏడబ్ల్యూడీ – 580 కి.మీ

ఈ కారు సెల్-టు-బాడీ (CTB), ఇంటెలిజెంట్ టార్క్ అడాప్టేషన్ కంట్రోల్ (iTAC) టెక్నాలజీతో వచ్చింది. ఇ-ప్లాట్‌ఫారమ్ 3పై ఆధారపడి పనిచేస్తుంది. మార్చి 31 వరకు ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకునే కస్టమర్లు 7కిలోవాట్ హోమ్ ఛార్జర్, ఇన్‌స్టాలేషన్ సర్వీస్, 3kW పోర్టబుల్ ఛార్జింగ్ బాక్స్, బీవైడీ సీల్ వీటోఓఎల్ (VTOL) మొబైల్ పవర్ సప్లయ్ యూనిట్, ఆరు సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఫ్రీ-ఛార్జ్ మొదటి సర్వీస్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Underground Bunker : రూ.2200 కోట్ల విలువైన రహస్య భూగర్భ బంకర్ నిర్మిస్తున్న జుకర్‌బర్గ్.. 30 బెడ్‌రూమ్‌లు, డజనుకుపైగా భవనాలు..!