Underground Bunker : రూ.2200 కోట్ల విలువైన రహస్య భూగర్భ బంకర్ నిర్మిస్తున్న జుకర్‌బర్గ్.. 30 బెడ్‌రూమ్‌లు, డజనుకుపైగా భవనాలు..!

Mark Zuckerberg : మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ హవాయి ద్వీపాల్లో 2200 కోట్ల వ్యయంతో అత్యంత అరుదైన సీక్రెట్ బంకర్‌ను నిర్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Underground Bunker : రూ.2200 కోట్ల విలువైన రహస్య భూగర్భ బంకర్ నిర్మిస్తున్న జుకర్‌బర్గ్.. 30 బెడ్‌రూమ్‌లు, డజనుకుపైగా భవనాలు..!

Why Zuckerberg's Underground Bunker, With 30 Bedrooms Worth 270 Million Dollars

Mark Zuckerberg Underground Bunker : అదో అత్యంత సుందరమైన ద్వీపం.. అత్యంత మారుమూల ద్వీపమైన హవాయిలో మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ రహస్య బంకర్ నిర్మిస్తున్నారంటూ నివేదికలు వెల్లడించాయి. ఈ మిస్ట్రరీ ప్రాజెక్ట్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 270 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2200 కోట్లు) వ్యయంతో మెటా సీఈఓ ఈ సీక్రెట్ బంకర్ నిర్మిస్తున్నారంటూ ఓ నివేదిక వెల్లడించింది. వాస్తవానికి ఇదో అతిపెద్ద భూగర్భ బంకర్ అని అంటున్నారు. చాలా ఏళ్లుగా ఈ బంకర్‌ను జుకర్‌బర్గ్ నిర్మిస్తున్నప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది.

Read Also : Realme 12 Series Launch : రియల్‌మి నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

ఇతర బంకర్లతో పోలిస్తే.. ఈ సీక్రెట్ బంక్ చాలా ఖరీదైనది మాత్రమే కాదు.. అత్యంత అరుదైనదిగా చెప్పవచ్చు. వైర్డ్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. జుకర్‌బర్గ్ నిర్మించే ఈ భూగర్భ బంకర్ కవాయిలోని కూలౌ రాంచ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది భూగర్భంలో 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని పేర్కొంది. 2014లో మెటా సీఈఓ ఈ లగ్జరీ ఎస్టేట్‌ కొనుగోలు చేసి అప్పటినుంచి బంకర్ నిర్మాణం చేపట్టినట్టు నివేదిక వెల్లడించింది.

30కి పైగా బెడ్ రూమ్స్, డజనకు పైగా భవనాలు :
ఈ ప్రాపర్టీలో 30 లేదా అంతకంటే ఎక్కువ బెడ్‌రూమ్‌లు, అంతే సంఖ్యలో బాత్‌రూమ్‌లతో రెండు డజనుకు పైగా భవనాలు ఉన్నాయి. వైర్డ్ ప్రకారం.. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడికి రెండు సెంట్రల్ భవనాలు ఒక సొరంగం ద్వారా అనుసంధానమై ఉంటాయి. చివరిలో ఈ రెండింటి మధ్య అనుసంధానం విడిపోతుంది. ఇందులోని నివాస స్థలం, మెకానికల్ రూమ్‌కు నిచ్చెన ద్వారా చేరుకోవచ్చు. అంతేకాదు.. ఇందులో ఎస్కేప్ హాచ్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న బృందం బంకర్‌ను సౌండ్‌ప్రూఫ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అంటే.. కీప్యాడ్‌ల ద్వారా ఇందులోని సదుపాయాలను యాక్సెస్ చేయవచ్చు.

పవర్ సప్లయ్, ఆహారం తయారు చేసుకునే వీలుంటుంది. ఈ సీక్రెట్ బంకర్ నిర్మాణం గురించి జుకర్‌బర్గ్ అధికారింగా ఇప్పటివరకూ ప్రకటన చేయలేదు. అమెరికన్ మ్యాగజైన్ ప్రకారం.. భూగర్భ బంకర్ డోర్ లోహంతో తయారైంది. బంకర్ చుట్టూ కాంక్రీటుతో నిండి ఉంటుంది. 2014లో కౌయ్‌లో భూమిని జుకర్‌బర్గ్ కొనుగోలు చేశారు. గత ఏడాది డిసెంబరులో బంకర్‌లను నిర్మించాలనే మెటా సీఈఓ నిర్ణయంపై అనేక నివేదికలు బయటకు వచ్చాయి.

బంకర్ నిర్మాణ దృశ్యాలు బయటకు.. కార్మికుల తొలగింపు :
వైర్డ్ నివేదిక ప్రకారం.. సెక్యూరిటీ గార్డుల నుంచి ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్ల వరకు ప్రాజెక్ట్‌లోని కార్మికులందరూ రహస్య ఒప్పందాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. అంటే.. ఈ నిర్మాణ పనుల్లో పాల్గొనేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బంకర్ వివరాలను బహిర్గతం చేయకూడదు.

గత ఏడాదిలో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న చాలా మంది కార్మికులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో ఈ బంకర్ నిర్మాణ పనుల గురించి సెల్ఫీలను షేర్ చేయడంతో వారిని పనిలో నుంచి తొలగించినట్టు నివేదికలు వెలువడ్డాయి. కవాయి దీవుల్లో 73 వేల మంది జనాభా నివసిస్తున్నారు. ఈ ద్వీపాన్ని ది గార్డెన్ ఐల్‌గా పిలుస్తుంటారు.

Read Also : OnePlus 11R 5G Price : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!