Post Office Scheme
Post Office Scheme : పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేవారికి సూపర్ స్కీమ్.. స్టాక్ మార్కెట్లో పెట్టబడి పెట్టడం కన్నా స్థిరమైన, సురక్షితమైన పెట్టుబడికి పోస్టాఫీసు పథకాలే మంచి రాబడిని అందిస్తాయి. ఇందులో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) అద్భుతమైన ఆప్షన్. ఈ పథకం ప్రత్యేకించి భార్యాభర్తలు, సీనియర్ సిటిజన్లు, పిల్లల భవిష్యత్తు కోసం అందుబాటులో ఉన్నాయి.
పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రతి నెలా (Post Office Scheme) ఒక స్థిర మొత్తాన్ని వడ్డీగా అందుకోవచ్చు. స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. మీరు కూడా ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటే ఇప్పుడే నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పెట్టండి. కేవలం 5 ఏళ్లలో అద్భుతమైన రాబడిని పొందవచ్చు. వడ్డీ ద్వారానే నెలకు రూ. 5,550 వరకు సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఈ పథకంలో ఎలా చేరాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఏంటి? :
భారత పోస్టల్ శాఖ ఈ ప్రభుత్వ పథకం పూర్తిగా సురక్షితమైనది. చిన్న పెట్టుబడిదారులలో బాగా పాపులర్ అయింది. కనీసం రూ. 1,000 పెట్టుబడితో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సింగిల్, జాయింట్ అకౌంట్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. సింగిల్ అకౌంటులో గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంటులో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంది.
ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. ఒక్కొక్కటి 5 ఏళ్లు పొడిగించవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టాఫీసు పథకంలో వార్షిక వడ్డీ రేటు 7.4శాతంగా అందిస్తుంది. వడ్డీ మొత్తాన్ని ప్రతి నెలా అకౌంటులో జమ చేస్తారు. క్రమం తప్పకుండా ఆదాయాన్ని పొందవచ్చు.
వడ్డీ పొందాలంటే? :
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో వార్షిక వడ్డీని 12 సమాన భాగాలుగా విభజిస్తారు. ప్రతి నెలా మీ అకౌంట్లలో వడ్డీ జమ అవుతుంది. ప్రతి నెలా వడ్డీని విత్‌డ్రా చేయకపోతే ఈ మొత్తం మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంటులో డిపాజిట్ అవుతుంది. ఈ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వ్యవధి పూర్తయిన తర్వాత మీరు ఈ వడ్డీని అసలుతో పాటు ఒకేసారి తీసుకోవచ్చు.
జాయింట్, సింగిల్ అకౌంట్లతో భారీ ఆదాయం :
మీరు వివాహితులై రూ. 15 లక్షల జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. వార్షిక వడ్డీ సుమారు రూ. 1,11,000 ఉంటుంది. మీకు నెలకు సుమారు రూ. 9,250 స్థిర ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా, ఒక వ్యక్తి ఒకే అకౌంటులో రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే వారికి నెలకు సుమారు రూ. 5,550 వడ్డీ రేటు లభిస్తుంది. పూర్తిగా సురక్షితమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ప్రభుత్వం అందించే అద్భుతమైన పథకం. ఇందులో పెట్టుబడి పెడితే ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు.
మీ పిల్లల పేరు మీద అకౌంట్ తెరవండి :
ఈ పోస్టాఫీసు పథకంలో ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే.. 10 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పేర్లపై అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. సంపాదించిన వడ్డీని వారి స్కూల్ ఫీజులు, ఉన్నత చదువులు లేదా ఏదైనా ఇతర విద్యా ఖర్చులకు ఉపయోగించవచ్చు. తల్లిదండ్రులకు అవసరమైనప్పుడు డబ్బుపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.