డిసెంబర్‌లోనే లాంచ్ : TikTok కంపెనీ నుంచి మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు 

  • Publish Date - November 18, 2019 / 10:52 AM IST

ప్రపంచవ్యాప్తంగా TikTok యాప్ ఎంతో పాపులర్ అయింది. టిక్ టాక్ కంపెనీ అయిన బీజింగ్ ByteDance మరో సరికొత్త సర్వీసుతో ముందుకొస్తోంది. అదే.. మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు. బైట్ డాన్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ వచ్చే నెల (డిసెంబర్)లో మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసును లాంచ్ చేయబోతోంది. 

తమ ప్రధాన మార్కెట్ ఉన్న దేశాలైన ఇండోనేషియా, బ్రెజిల్ సహా ఇండియాలో తొలుత ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. యూనివర్శల్ మ్యూజిక్, సోనీ మ్యూజిక్, వార్నర్ మ్యూజిక్ వంటి అతిపెద్ద మ్యూజిక్ సంస్థలతో పోటీగా బైట్ డాన్స్ ఈ కొత్త మ్యూజిక్ సర్వీసును ప్రవేశపెట్టనుంది. 

తమ కొత్త మ్యూజిక్ సబ్ స్ర్కిప్షన్ సర్వీసులో తమ సాంగ్స్ సహా గ్లోబల్ లైసెన్స్ కోసం ఒప్పందం చేసుకుంటున్నట్టుగా ఓ రిపోర్టు వెల్లడించింది. ముందుగా ఇండియా సహా ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లో ఈ మ్యూజిక్ సర్వీసును ప్రారంభించి ఆ తర్వాత భవిష్యత్తులో యూనైటెడ్ స్టేట్స్ లో ప్రారంభాలని కంపెనీ భావిస్తున్నట్టు నివేదిక తెలిపింది. 

ByteDance యాప్‌లోని లైబ్రరీలో ఆన్-డిమాండ్ మ్యూజిక్, వీడియో క్లిప్స్ అఫర్ చేస్తోంది. బైట్ డాన్స్ ప్రవేశపెట్టబోయే మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ కు ఇంకా పేరు పెట్టలేదు. ధరపై కూడా క్లారిటీ లేదు. నెలకు 10 డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఈ సర్వీసు లాంచ్ విషయంలో కామెంట్ చేసేందుకు కంపెనీ అందుబాటులో లేదు.