Splendor
దేశంలో 2025 మేలో మోటార్‌సైకిల్ విక్రయాలు మొత్తం 8,85,467 యూనిట్లకు చేరాయి. 2024 మేలో అమ్ముడైన 8,32,586 యూనిట్లతో పోలిస్తే 6.35 శాతం వృద్ధి నమోదైంది. వాల్యూమ్ పరంగా 52,881 యూనిట్లు పెరిగాయి. నెలలవారీగా చూస్తే ఏప్రిల్ 2025లో 7,21,735 యూనిట్లు అమ్ముడయ్యాయి. మేలో ఇది 1,63,735 యూనిట్ల విక్రయాలు ఎక్కువగా జరిగాయి.
హీరో స్ప్లెండర్ 3,10,335 యూనిట్ల విక్రయాలతో మొదటి స్థానంలో నిలిచింది. 2024 మేలో 3,04,663 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత నెలలో 5,672 యూనిట్ల వృద్ధితో 1.86 శాతం గ్రోత్ నమోదైంది.
రెండో స్థానంలో హోండా షైన్ నిలిచింది. 2025 మేలో 1,58,271 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మేలో అమ్ముడుపోయిన 1,49,054 యూనిట్లతో పోలిస్తే 6.18 శాతం వృద్ధి సాధించింది.
బజాజ్ పల్సర్ అమ్మకాల్లో 4.93 శాతం తగ్గుదల నమోదైంది. 2025 మేలో 1,22,151 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2024 మేలో 1,28,480 యూనిట్లతో పోలిస్తే 6,329 యూనిట్ల అమ్మకాలు తగ్గాయి.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ 1,07,768 యూనిట్ల విక్రయాలతో టాప్ 4లో నిలిచింది. మే 2024లో 87,143 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈసారి 23.67 శాతం వృద్ధి నమోదైంది.
ఈ పై నాలుగు మోడళ్లు కలిపి మొత్తం టాప్ 10 మోటార్‌సైకిళ్లలో 79 శాతం వాటా దక్కించుకున్నాయి.
Top 10 Scooters: అత్యధికంగా అమ్ముడుపోతున్న స్కూటర్ ఏదో తెలుసా? జుపిటర్, ఓలా కాదు..
50,000లోపు యూనిట్లు అమ్ముడుపోయిన మోటార్‌సైకిళ్లు..
టీవీఎస్ అపాచీ బైకులు 49,099 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2024 మేలో 37,906 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈసారి 29.53 శాతం వృద్ధితో 11,193 యూనిట్ల వాల్యూమ్ పెరుగుదల కనిపించింది.
టీవీఎస్ కంపెనీ నుంచి రైడర్ 35,401 యూనిట్ల అమ్మకాలు సాధించింది. కానీ 2024 మేతో పోలిస్తే 4.96 శాతం తగ్గుదల నమోదు చేసుకుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 2025 మేలో 28,628 యూనిట్లు అమ్ముడై 20.39 శాతం వృద్ధిని సాధించింది. 2024 మేలో 23,779 యూనిట్లు అమ్ముడయ్యాయి. వాల్యూమ్ పరంగా 4,849 యూనిట్లు పెరిగాయి. క్లాసిక్ 350కు 3.23 శాతం మార్కెట్ వాటా ఉంది.
హోండా సీబీ యూనికార్న్ బైకులు 28,616 అమ్ముడుపోయాయి. 2024 మేలో 24,740 యూనిట్లు అమ్ముడయ్యాయి. 15.67 శాతం వృద్ధి కనిపించింది.
బజాజ్ ప్లాటినా అమ్మకాలు తగ్గాయి. 2025 మేలో 27,919 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 మేలో 30,239 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంటే 7.67 శాతం తగ్గుదల కనిపించింది.
బుల్లెట్ 350 అమ్మకాలు భారీగా పెరిగాయి. 2024 మేలో 9,332 యూనిట్లు అమ్ముడవగా, 2025 మేలో 17,279 యూనిట్లు అమ్ముడయ్యాయి. 85.16 శాతం గ్రోత్‌తో 7,947 యూనిట్ల వాల్యూమ్ పెరిగింది.