Top 10 Scooters: అత్యధికంగా అమ్ముడుపోతున్న స్కూటర్ ఏదో తెలుసా? జుపిటర్, ఓలా కాదు..

ఓలా ఎలక్ట్రిక్ విక్రయాలు పడిపోతున్నాయి.

Top 10 Scooters: అత్యధికంగా అమ్ముడుపోతున్న స్కూటర్ ఏదో తెలుసా? జుపిటర్, ఓలా కాదు..

Updated On : June 22, 2025 / 5:02 PM IST

మార్కెట్లో హోండా యాక్టివా మరోసారి సత్తా చాటింది. ఈ ఏడాది మేలో టీవీఎస్‌ జుపిటర్‌, సుజుకి కంటే హోండా యాక్టివా అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. అయితే, గత ఏడాది మేతో పోల్చి చూస్తే మాత్రం ఈ సారి హోండా యాక్టివా అమ్మకాలు 11.85 శాతం తగ్గాయి.

గత ఏడాది మేలో 2,16,352 యూనిట్లు అమ్ముడుపోతే, ఈ ఏడాది మేలో 1,90,713 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయినప్పటికీ భారత్‌లో హోండా యాక్టివా ఇప్పటికీ ఎక్కువగా అమ్ముడుపోతున్న స్కూటర్‌గా ఉంది.

ఇక టీవీఎస్ జుపిటర్‌ స్కూటర్లు మేలో 28.70 శాతం వృద్ధితో 97,606 యూనిట్లు అమ్ముడుపోయాయి. అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లలో రెండో స్థానంలో జుపిటర్‌ స్కూటర్లు ఉన్నాయి.

Also Read: ఈ కంపెనీ ఏడాదికి ఒక్కో ఉద్యోగిపై రూ.21 కోట్లు సంపాదిస్తుంది తెలుసా? ఏ కంపెనీ ఎంతో ఫుల్ లిస్ట్..

సుజుకి ఆక్సెస్ 16.92 శాతం వృద్ధితో 75,778 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ విక్రయాలు 7.75 శాతం తగ్గి.. 37,264 యూనిట్లు అమ్ముడుపోయాయి.

అయితే, టీవీఎస్‌ బ్రాండ్‌కు చెందిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ అమ్మకాలు 60 శాతానికి పైగా పెరిగి 27,642 యూనిట్లకు చేరాయి. ఏడాది పరంగా చూసుకుంటే ఐక్యూబ్ అమ్మకాలు 3 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి.

హోండా డియో స్కూటర్ల అమ్మకాలు 10 శాతం తగ్గుదలతో 26,220 యూనిట్లుగా ఉన్నాయి. బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వైపు దృష్టి సారించింది. దాని చెతక్‌ స్కూటర్లు ఏకంగా 95.83 శాతం వృద్ధిని నమోదు చేసుకుని 25,540 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది మే నెలలో చెతక్‌ స్కూటర్లు 13,000 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్ల అమ్మకాలు 13.84 శాతం తగ్గి 25,205 యూనిట్లకు చేరాయి. సుజుకి బర్గ్‌మన్ మెరుగైన ఫలితాలను ఇచ్చింది. 26.46 శాతం వార్షిక వృద్ధితో 24,688 యూనిట్లకు చేరింది. ఓలా ఎలక్ట్రిక్ విక్రయాలు పడిపోతున్నాయి. 50 శాతానికి పైగా తగ్గుదలతో 18,501 యూనిట్లే అమ్ముడుపోయాయి.