Top 5 AC deals: అమెజాన్‌లో తక్కువ ధరకు టాప్‌ కంపెనీల ఏసీలు.. కొనుక్కుని మీ ఇంటిని కూల్‌గా మార్చేయండి.. 

పలు బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు.

వేసవిలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి ఎయిర్ కండిషనర్‌లు తప్పనిసరి అవుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలో మంచి ఏసీని కొనాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్‌లో డైకిన్, క్యారియర్, లాయిడ్, వోల్టాస్, పానాసోనిక్ వంటి కంపెనీలు ఎయిర్ కండిషనర్లపై పలు ఆఫర్‌లను అందిస్తున్నాయి. టాప్ 5 ఏసీ డీల్స్ ఏమున్నాయో చూద్దాం..

డైకిన్ 1 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
డైకిన్ 1 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర సాధారణంగా రూ.42,000గా ఉంటుంది. అమెజాన్‌లో ఇప్పుడు రూ.39,000 కంటే తక్కువ ధరకు లభ్యమవుతోంది. పలు బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో 3డీ ఎయిర్‌ఫ్లో, పీఎం 2.5 ఫిల్టర్, ఆర్32 రిఫ్రిజెరాంట్ కూడా ఉన్నాయి.

క్యారియర్ 1 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
క్యారియర్ 1 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర రూ.36,500. అమెజాన్‌లో మాత్రం రూ.31,988కే లభ్యమవుతోంది. దీంతో దాదాపు రూ.4,000 ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు, పలు బ్యాంక్ కార్డుల ద్వారా అదనంగా రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ధర రూ.31,500కే కొనుక్కోవచ్చు.

వోల్టాస్ 1 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
వోల్టాస్ 1 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర రూ.32,000. అమెజాన్‌లో ఈ ఏసీని రూ.30,990కు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ రూ.1,000 కూపన్‌ను కూడా అందిస్తోంది. దీంతో ధర రూ.29,990కి తగ్గుతంది. రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో రూ.28,500 కంటే తక్కువ ధరకు కొనుక్కునే ఛాన్స్ ఉంది.

లాయిడ్ 1.0 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
లాయిడ్ 1.0 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర రూ.36,000. దీన్ని అమెజాన్‌లో రూ.30,990కే కొనుక్కోవచ్చు. పలు క్రెడిట్ కార్డులపై రూ.1,500 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. దీంతో రూ.30,000 కంటే తక్కువ ధరకే కొనే అవకాశం ఉంది. ఇందులో తక్కువ గ్యాస్ చెక్, టూ-వే స్వింగ్, ఫిల్టర్ క్లీనింగ్ చెక్, టర్బో కూల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పానాసోనిక్ 1 టన్ ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ
పానాసోనిక్ 1 టన్ ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ ధర దాదాపు రూ.34,990. ఈ ఎయిర్ కండిషనర్‌ను అమెజాన్‌లో రూ.33,990కి పొందవచ్చు. పలు బ్యాంకు కార్డులతో రూ.1,500 డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు.