Top 5 Affordable Family Cars
Top 5 Affordable Family Cars : కొత్త కారు కొంటున్నారా? అయితే, మీకోసం అత్యంత సురక్షితమైన కార్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు మంచి సేఫ్టీ అందించే కార్ల కోసం చూస్తుంటే ఇలాంటి కార్లను కొనితీరాల్సిందే.. 2025 ఏడాదిలో సేఫ్టీ ఫీచర్ల కార్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ కార్లకు ప్రీమియం ఫీచర్ తప్పనిసరిగా మారింది.
ప్రమాద సమయంలో సేఫ్టీ, ప్రొటెక్షన్ అందించే కార్లవైపే వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే కార్ల తయారీదారులు కూడా తక్కువ ధర కార్లలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చుతున్నారు. మీరు రూ. 15 లక్షల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇది మీకోసమే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో హై వేరియంట్‌లలో విక్రయించే టాప్ 5 కార్లలో ఈ సూపర్-సేఫ్ బడ్జెట్ ఫ్యామిలీ కార్లను ఓసారి పరిశీలించండి..
హ్యుందాయ్ i20 :
హ్యుందాయ్ i20 మోడల్ కారు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా చెప్పవచ్చు. 2025లో కూడా సేఫ్టీ పరంగా అంతే పాపులర్ అయింది. టాప్ వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులు, ESC, TPMS ఉన్నాయి. స్టైలిష్‌గా, డ్రైవ్ చేసేందుకు సరదాగా ఉంటుంది. పూర్తిగా సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. సిటీలో నడిపే వారికి సరైన ఫ్యామిలీ కారుగా చెప్పవచ్చు. ఈ కారు ధర సుమారు రూ. 7.5 లక్షల నుంచి లభ్యమవుతుంది. హ్యుందాయ్ i20 కారు సిటీ ఫ్యామిలీలకు ప్రీమియం సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది.
టాటా నెక్సన్ :
టాటా నెక్సాన్ కాంపాక్ట్ SUV మోడల్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. 5-స్టార్ GNCAP సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇప్పుడు అనేక వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో లభ్యమవుతుంది. చాలా విశాలంగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్, EV ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ. 8 లక్షల నుంచి అందుబాటులో ఉంది. 5-స్టార్ సేఫ్టీ, స్పేస్, మల్టీ ఫ్యూయల్ ఆప్షన్లను అందిస్తుంది.
టయోటా గ్లాంజా :
ఫ్యామిలీ కస్టమర్లకు టయోటా గ్లాంజా బెస్ట్ కారు. ఈ కారులో ఫ్యూయల్ కెపాసిటీతో ఇప్పుడు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. స్మూత్ డ్రైవ్ కోసం ఫ్యామిలీ రైడర్లు ఎక్కువగా టయోటా గ్లాంజా ఇష్టపడతారు. గ్లాంజా హై వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి. దాదాపు రూ. 7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సేఫ్టీ, సౌకర్యాన్ని కోరుకునే కుటుంబాలకు ఈ కారు బెస్ట్. టయోటా గ్లాంజా సౌకర్యం, మైలేజ్, అడ్వాన్స్ సేఫ్టీ టెక్నాలజీని కలిగి ఉంది.
కియా సోనేట్ :
2024 సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది. 2025 మోడల్ కారు కూడా ఈ ట్రెండ్ కొనసాగిస్తోంది. దాదాపు అన్ని వేరియంట్లలో ఫ్రంట్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారు ధర రూ. 7.9 లక్షల నుంచి విక్రయిస్తోంది. సేఫ్టీ, ఫీచర్లు, డిజైన్ కోరుకునే వినియోగదారులకు బెస్ట్ కారు. కియా సోనెట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్‌ల వంటి ఫీచర్లు కలిగి ఉంది.
హోండా అమేజ్ :
కొత్త జనరేషన్ హోండా అమేజ్ (2025) టాప్ ట్రిమ్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. హోండా ఇంజిన్, CVT గేర్‌బాక్స్, భారీ ఇంటీరియర్‌లతో ఫ్యామిలీ సెడాన్‌గా వస్తుంది. ఈ కారు ధర రూ. 7.2 లక్షల నుంచి ఉంటుంది. హోండా అమేజ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, స్మూత్ డ్రైవ్ వంటి ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.