Google AI summaries : బిగ్ అప్‌డేట్.. గూగుల్ డిస్కవరీ ఫీడ్‌లో కొత్త AI సమ్మరీస్ ఫీచర్.. ఇకపై ఏఐ కంటెంట్ చూడొచ్చు.. యూజర్లకు లాభమేంటి?
Google AI summaries : iOS, Android యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ యాప్‌లో కనిపించే డిస్కవర్ ఫీడ్‌లో AI-జనరేటెడ్ సమ్మరీస్ ప్రవేశపెట్టింది.

Google AI summaries
Google AI summaries : డిజిటల్ యుగంలో ఏఐ వేగంగా దూసుకుపోతోంది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐకి సంబంధించి కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ డిస్కవర్‌లో కొత్త ఏఐ-ఆధారిత ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్ యాప్‌లో కనిపించే హెడ్‌లైన్స్ న్యూస్ లిస్టును ఏఐ జనరేటెడ్ కంటెంట్‌తో రిప్లేస్ చేస్తోంది.
ప్రస్తుతం, డిస్కవర్ ఫీడ్‌లో న్యూస్ మీడియా కంటెంట్ నుంచి న్యూస్ హెడ్‌లైన్స్ ఫీచర్డ్ ఇమేజ్‌తో పాటు కనిపించేవి. ఇకపై ఇదే స్థానంలో ఏఐ జనరేటెడ్ కంటెంట్ సమ్మరీస్ కనిపిస్తాయి. చాట్‌బాట్ ఆన్సర్ల మాదిరిగానే వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఏఐ కంటెంట్ అన్ని సోర్సెస్ నుంచి జనరేట్ చేసి చూపిస్తుంది అనమాట.. అలాగే కంటెంట్ సోర్స్ స్టోరీ హెడ్‌లైన్‌తో లెఫ్ట్ సైడ్ ఐకాన్లతో కనిపిస్తాయి.
యూఎస్ యూజర్లకు మాత్రమే :
టెక్ క్రంచ్ రిపోర్టు ప్రకారం.. ప్రస్తుతానికి అమెరికాలోని వినియోగదారులకు మాత్రమే ఈ ఏఐ సమ్మరీస్ ఫీచర్ అందుబాటులో ఉంది. వినియోగదారులకు న్యూస్ కంటెంట్ నుంచి హెడ్‌లైన్స్ బదులుగా డిస్కవర్ ఫీడ్‌లో టాప్ న్యూస్ స్టోరీల AI సమ్మరీస్ వచ్చాయి. ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల కోసం గూగుల్ యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు న్యూస్ స్టోరీలతో AI సమ్మరీస్ జనరేట్ అవుతాయి. పబ్లిషర్ల లోగోలు ఆయా న్యూస్ స్టోరీ కూడా కనిపిస్తుంది.
ఈ ఫీచర్ వినియోగదారులకు లేటెస్ట్ న్యూస్ త్వరగా అందించే దిశగా గూగుల్ ఈ ఫీచర్ తీసుకొచ్చింది. కానీ, దీని కారణంగా న్యూస్ పబ్లిషర్ల సైట్ ట్రాఫిక్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. ఏదైనా కంటెంట్ చూసే యూజర్లు కంటెంట్ లోపలికి వెళ్లి చూడకుండా ఏఐ సమ్మరీస్ చదివి వెళ్లేపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో న్యూస్ పబ్లిషర్లలో ఆందోళన కలిగిస్తోంది.
కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
వినియోగదారులు టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మీడియా హౌస్ లోగోతో పాటు AI సమ్మరీస్ చూడవచ్చు. ఓవర్ ల్యాపింగ్ ఐకాన్లపై ట్యాప్ చేస్తే ‘More’ బటన్ కనిపిస్తుంది. ఇక్కడే యూజర్లు వివిధ పబ్లిషర్ల సైట్ కంటెంట్ లింక్ చేసిన స్టోరీల లిస్టును చూడవచ్చు. ప్రతి సమ్మరీ 3-లైన్ల ప్రివ్యూతో కనిపిస్తుంది. వినియోగదారులు కంటెంట్‌ను చూడాలంటే ‘See More’పై ట్యాప్ చేయొచ్చు.
ఇంకా, Google ‘AI- జనరేటెడ్ కంటెంట్ తప్పుగా ఉంటాయి ‘ అనే ఒక అలర్ట్ మెసేజ్ కూడా కనిపిస్తుంది. అంటే.. ఏఐ కంటెంట్ లేదా హ్యుమనైజ్ కంటెంట్ మధ్య తేడాలను గుర్తించేందుకు వీలుగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చదివే యూజర్లకు అది ఏఐ కంటెంట్ లేదా రియల్ కంటెంట్ అనేది తెలుసుకోవచ్చు.
ప్రధానంగా ఈ AI సమ్మరీస్ లైఫ్ స్టయిల్, స్పోర్ట్స్, ఎంటర్ టైన్మెంట్ వంటి అంశాలపైనే ఎక్కువగా ఉంటాయి. వినియోగదారులు ఏ స్టోరీలను క్లిక్ చేయాలో నిర్ణయించుకునేలా ఉంటుందని తద్వారా బ్రౌజింగ్ సామర్థ్యం మెరుగుపడుతుందని గూగుల్ చెబుతోంది.
ఏఐతో పబ్లిషర్లకు కలిగే నష్టమేంటి? :
సాధారణంగా ఎవరైనా యూజర్ గూగుల్ సెర్చ్ లో ఏదైనా అంశం కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు పూర్తి సమాచారం కోసం ఆయా సంబంధిత సైటులోకి వెళ్లి చూడాల్సి వస్తుంది. అదే ఈ ఏఐ సమ్మరీస్ ఫీచర్ ద్వారా వార్తలోపలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కంటెంట్ ఆధారంగా ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ మాత్రమే సెర్చ్‌లో కనిపిస్తుంది. అదే చదివి యూజర్ వెళ్లిపోతాడు.
దీనివల్ల పబ్లిషర్ల సైట్ కంటెంట్ విజిట్ చేసే అవకాశం ఉండదు. ఫలితంగా ట్రాఫిక్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదే విషయంలో పబ్లిషర్లలో ఆందోళన కలిగిస్తోంది. ది ఎకనామిస్ట్ ప్రకారం.. సిమిలర్‌వెబ్‌ను ఉటంకిస్తూ.. జూన్ 2025లో ప్రపంచ సెర్చ్ ట్రాఫిక్ సంవత్సరానికి 15శాతం తగ్గింది. డిజిటల్ పబ్లిషర్ల ఆదాయం, కంటెంట్ విజిబిలిటీని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై చర్చలకు మరింత ఆజ్యం పోసింది.
డిస్కవర్‌లో కలిగే మార్పులేంటి? :
ఏఐ సమ్మరీలతో పాటు గూగుల్ కొన్ని హెడ్‌లైన్స్ కింద బుల్లెట్-పాయింట్డ్ స్టోరీ ప్రివ్యూలతో టెస్టింగ్ చేస్తోంది. అయితే, AI సమ్మరీస్ మాదిరిగా కాకుండా ఈ ప్రివ్యూలు ఏ AI-జనరేటెడ్ లేబుల్‌ను కలిగి ఉండవు. దాంతో ఏది హ్యుమన్-క్యూరేటెడ్, ఏది ఏఐ జనరేటెడ్ కంటెంట్ స్నిప్పెట్ అనేది రెండింటి మధ్య తేడాను గుర్తించడం కష్టంగా మారుతుంది.
కంటెంట్ అగ్రిగేషన్ కోసం జనరేటివ్ ఏఐ అవసరమని టెక్ ఇండస్ట్రీ భావిస్తున్న తరుణంలో గూగుల్ డిస్కవర్‌లో ఏఐ సమ్మరీస్ ఫీచర్ తీసుకొచ్చింది. వినియోగదారులు స్పీడ్ గా అవసరమైన సమాచారాన్ని యాక్సస్ చేయగలరు. కానీ, ఆదాయంపై ఆధారపడే డిజిటల్ మీడియా అవుట్‌లెట్‌లకు ట్రాఫిక్ నష్టపోవాల్సి వస్తుంది.