Top 5 Electric Scooters : కొత్త ఇ-స్కూటర్ కొంటున్నారా? సింగిల్ ఫుల్ ఛార్జ్‌తో హైరేంజ్ టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఏది కొంటారో మీ ఇష్టం..!
Top 5 Electric Scooters : ఓలా ఎలక్ట్రిక్ నుంచి హీరో మోటోకార్ప్ వరకు అత్యధిక రేంజ్ అందించే టాప్ 5 ఇ-స్కూటర్ల జాబితా ఓసారి లుక్కేయండి..

Top 5 Electric Scooters
Top 5 Electric Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. భారత టూవీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో అనేక బ్రాండ్ల స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏడాదిలో దేశ మార్కెట్లో ఇ-స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈవీ స్కూటర్ అనగానే అందరూ ముందుగా అడిగేది.. రేంజ్ ఎంత? ఛార్జింగ్ పెట్టిన వెంటనే ఎంత దూరం వెళ్తుంది.. ఇదే ప్రశ్న వినిపిస్తుంటుంది. ఇటీవలి ఏళ్లలో బ్యాటరీ టెక్నాలజీ మరింత అప్‌గ్రేడ్ అయింది. సింగిల్-ఛార్జ్ రేంజ్ వాహనాలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగింది.
ఫుల్ ఛార్జ్‌పై హై రేంజ్ అందించే ఎలక్ట్రిక్ వాహనాలకు అంతే స్థాయిలో క్రేజ్ పెరిగింది.. మీరు కూడా ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తుంటే.. ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను ఓసారి పరిశీలించండి. ఇందులో మీకు నచ్చిన ఇ-స్కూటర్ కొని ఇంటికి తెచ్చుకోవచ్చు.
1. ఓలా S1 ప్రో+ థర్డ్ జనరేషన్.. రేంజ్ 320 కి.మీ :
ఓలా ఎలక్ట్రిక్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ థర్డ్ జనరేషన్ స్కూటర్ ఇది. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అయింది. ఓలా S1 Pro+ టాప్-స్పెక్ వేరియంట్ 5.3 kWh బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 320 కిమీ (IDC) రేంజ్ అందిస్తుంది.
ఈ వెర్షన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కేవలం 2.1 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. 141 కి.మీ/గం టాప్ స్పీడ్ చేరుకుంటుంది. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లభ్యమవుతుంది.
2. అల్ట్రావయోలెట్ టెస్సరాక్ట్ రేంజ్.. 261 కి.మీ :
అల్ట్రావయోలెట్ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది మార్చిలోనే లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు. టెస్సెరాక్ట్ స్కూటర్ మొత్తం 3 బ్యాటరీ (3.5kWh, 5kWh, 6kWh) ఆప్షన్లలో వస్తుంది.
అతిపెద్ద 6kWh సింగిల్ ఛార్జ్‌పై 261 కి.మీ (IDC) రేంజ్ కలిగి ఉంటుంది. అల్ట్రావయోలెట్ నుంచి మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. 20.2hp ఎలక్ట్రిక్ మోటారుతో రన్ అయ్యే టెస్సెరాక్ట్ స్కూటర్ గరిష్టంగా 125kmph వేగాన్ని అందుకోగలదు.
3. సింపుల్ వన్ జెన్ 1.5.. రేంజ్ 248 కి.మీ :
సింపుల్ ఎలక్ట్రిక్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ జెన్ 1.5 ఈ ఏడాది ఫిబ్రవరిలోనే లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.65 (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు. సింపుల్ వన్ ట్విన్ బ్యాటరీ సెటప్‌తో వస్తుంది. 3.7kWh ఫ్లోర్‌బోర్డ్ యూనిట్, బూట్‌లో 1.3kWh పోర్టబుల్ ప్యాక్ కలిగి ఉంది.
సింగిల్ ఛార్జ్‌పై 248 కి.మీ (IDC) రేంజ్ అందిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. సింపుల్ వన్ జెన్ 1.5 గంటకు 105 కి.మీ టాప్ స్పీడ్ అందుకుంటుంది. 2.77 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకోగలదు.
4. టీవీఎస్ ఐక్యూబ్ ST స్కూటర్ : రేంజ్ 212 కి.మీ :
భారత ఈవీ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ ST స్కూటర్ టాప్ స్పెషిఫికేషన్లతో గత ఏడాదిలో లాంచ్ అయింది. ఈ రెండు బ్యాటరీ (3.5 kW, 5.3 kWh) ఆప్షన్లతో వస్తుంది. రెండోది ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 212 కి.మీ రేంజ్ కలిగి ఉంటుంది. 4.4 kW BLDC ఎలక్ట్రిక్ మోటారుతో రన్ అయ్యే ఐక్యూబ్ ST స్కూటర్ గరిష్టంగా 82 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. 4.5 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది.
5. హీరో విడా V2 ప్రో.. రేంజ్ 165 కి.మీ :
హీరో మోటోకార్ప్ విడా ఎలక్ట్రిక్ స్కూటర్లతో దూసుకుపోతోంది. భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లలో నెమ్మదిగా విస్తరిస్తోంది. ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ విడా V2 ప్రో ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు అందిస్తోంది. 3.9kWh రిమూవల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
హీరో విడా V2 ప్రో ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 165 కి.మీ (IDC) రేంజ్ అందిస్తుంది. 25Nm టార్క్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఈ స్కూటర్ గంటకు 90 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకోగలదు. 2.9 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ./గం. వేగాన్ని అందుకోగలదు.