Samsung Galaxy F36 5G : ఇది కదా 5G ఫోన్.. AI ఫీచర్లు, ట్రిపుల్ కెమెరాలతో శాంసంగ్ 5G ఫోన్ వచ్చేసింది.. ధర చాలా చీప్ గురూ..!

Samsung Galaxy F36 5G : శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్ చూశారా? ఏఐ ఫీచర్లు, ట్రిపుల్ రియర్ కెమెరాలతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ధర ఎంతంటే?

Samsung Galaxy F36 5G : ఇది కదా 5G ఫోన్.. AI ఫీచర్లు, ట్రిపుల్ కెమెరాలతో శాంసంగ్ 5G ఫోన్ వచ్చేసింది.. ధర చాలా చీప్ గురూ..!

Samsung Galaxy F36 5G

Updated On : July 19, 2025 / 3:33 PM IST

Samsung Galaxy F36 5G : శాంసంగ్ అభిమానుల కోసం కొత్త 5G ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy F36 5G) ఫోన్ లాంచ్ అయింది. దక్షిణ కొరియా దిగ్గజం (Samsung Galaxy F36 5G) ఈ కొత్త F-సిరీస్ ఫోన్ ధర రూ. 20వేల కన్నా తక్కువ ధరకే రిలీజ్ చేసింది.

ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌తో 50MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లెదర్ ఫినిష్ రియర్ ప్యానెల్‌ను కలిగి ఉంది. 3 కలర్ ఆప్షన్లలో అమ్మకానికి ఉంది. గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమిని లైవ్‌తో సహా ఏఐ ఫీచర్లను యాక్సస్ చేయొచ్చు. అలాగే, 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.

భారత్‌లో గెలాక్సీ F36 5G ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌ బేస్ వేరియంట్ ధర రూ. 17,499కు పొందవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ కూడా ఉంది. శాంసంగ్ కొత్త F-సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 18,999 మాత్రమే.

భారత మార్కెట్లో జూలై 29 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. కోరల్ రెడ్, లక్స్ వైలెట్, ఒనిక్స్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో లెదర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ కూడా ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ F36 5G స్పెసిఫికేషన్లు (Samsung Galaxy F36 5G) :
డ్యూయల్-సిమ్ హ్యాండ్‌సెట్, ఫుల్-HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరాతో వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 SoC కలిగి ఉంది. మాలి-G68 MP5 GPUతో వస్తుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం వేపర్ చాంబర్ కూడా ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌ కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు.

Read Also : PF Money Withdraw : ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో పీఎఫ్ కొత్త రూల్స్.. రిటైర్ కాకముందే PF ఖాతాలో మొత్తం డబ్బులు తీసుకోవచ్చు..!

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ :
ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. శాంసంగ్ గెలాక్సీ F36 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ 50MP f/1.8 సెన్సార్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. f/2.2 ఎపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 13MP కెమెరాను పొందవచ్చు. 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ లేటెస్ట్ F-సిరీస్ ఫోన్ ఆండ్రాయిడ్-15 ఆధారిత వన్ యూఐ 7 బాక్స్ వెలుపల రన్ అవుతుంది. కంపెనీ 6 జనరేషన్ ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమిని లైవ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్, ఏఐ ఎడిట్ సజేషన్స్ వంటి ఏఐ ఫీచర్లను కూడా పొందవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS + GLONASS అందిస్తుంది. 164.4×77.9×7.7m పరిమాణం, 197 గ్రాముల బరువు ఉంటుంది.