రూ.5వేల లోపు టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

Top 5 Best Phones Under 5000 : స్మార్ట్ ఫోన్లకే కాదు.. ఫీచర్ ఫోన్లకు కూడా మార్కెట్లో ఫుల్ క్రేజ్ ఉంది. స్మార్ట్ ఫోన్ల యుగమైన 2020లోనూ ఫీచర్ ఫోన్లు యూజర్లను ఇంకా అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. అందులోనూ రూ.5,000 బడ్జెట్ ఫీచర్ ఫోన్లు కూడా అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకున్నాయి. గూగుల్ Android Go ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అయ్యే ఈ ఫోన్లలో స్పీడ్, స్టేబిలిటీ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు మారాలనుకునే యూజర్లు ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లను ఎంచుకోవచ్చు..
అందులో 18:9 డిస్ ప్లే, డ్యుయల్ కెమెరాలు, 4G కనెక్టవిటీ, Android Go OS, వైడ్ రేంజ్ కలర్లు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మీకు తగిన బడ్జెట్‌లో ఫోన్లు కావాలంటే ఫీచర్లు ఫోన్లు ఎంచుకోవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.5,000 లోపు Best Smartpones జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన Top 5 Best Smart Phones ఎంచుకుని కొనుగోలు చేసుకోవచ్చు.. అవేంటో ఓసారి చూద్దాం..
1. Nokia 2.1 :
ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లలో Nokia 2.1 స్మార్ట్ ఫోన్ ఒకటి.. ఆండ్రాయిడ్ వన్ సర్టిఫికేషన్ తో వచ్చింది. Qualcomm MSM8917, Snapdragon 425 Soc తో పాటు 4000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ పై 1GB RAM తో రన్ అవుతుంది. కేవలం రూ.5 వేల కంటే తక్కువ బడ్జెట్ లో Nokia 2.1 స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. NOKIA 2.1 స్మార్ట్ ఫోన్ 8GB వేరియంట్ ధర అమెజాన్ వెబ్ సైట్లో రూ.6,991 ధరకు లభ్యమవుతోంది.
ఫీచర్లు + స్పెషిఫికేషన్లు :
Screen Size | : | 5.5″ (720 x 1280) |
Camera | : | 8 | 5 MP |
RAM | : | 1GB |
Battery | : | 4000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm MSM8917 Snapdragon 425 |
Processor | : | Quad |
2. NOKIA 1 :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ Oreo (Go Edition) ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది. 1GB RAM, Media Tek ప్రాసెసర్ కూడా ఉంది. లైట్ వెయిట్ ఆండ్రాయిడ్ OS vanilla Androidపై పనిచేస్తుంది. ఫోన్ బ్యాక్ కవర్ కూడా మీకు నచ్చిన్ స్టయిల్ లో మార్చుకోవచ్చు. కేవలం రూ.5 వేల కంటే తక్కువ బడ్జెట్ లో నోకియా 1 ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 8GB వేరియంట్ ధర అమెజాన్ వెబ్ సైట్లో రూ.5,688 ధర నుంచి లభ్యమవుతోంది.
ఫీచర్లు + స్పెషిఫికేషన్లు :
Screen Size | : | 4.5″ (480 x 854) |
Camera | : | 5 | 2 MP |
RAM | : | 1 GB |
Battery | : | 2150 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek MT6737M |
Processor | : | Quad |
3. XIAOMI REDMI GO :
ఆండ్రాయిడ్ Go ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అయ్యే ఫోన్లలో అత్యంత చౌకైనది షియోమీ Redmi GO స్మార్ట్ ఫోన్ ఒకటి. రూ.5 వేల బడ్జెట్ ఫోన్లలో మంచి ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ తో పాటు డీసెంట్ కెమెరాలు ఉన్నాయి. Android Go OS పై రన్ అవుతుంది. గూగుల్ Go యాప్స్ కూడా ఉన్నాయి. తక్కువ స్టోరేజీతో పాటు తక్కువ RAM మాత్రమే ఈ యాప్స్ తీసుకుంటాయి. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ ధర రూ.4740 నుంచి అందుబాటులో ఉంది.
ఫీచర్లు + స్పెషిఫికేషన్లు :
Screen Size | : | 5″ (720 X 1280) |
Camera | : | 8 | 5 MP |
RAM | : | 1GB |
Battery | : | 3000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 425 |
Processor | : | Quad |
4. RELIANCE Jio Phone :
రిలయన్స్ జియో అందించే Jio Phone పూర్తి స్థాయిలో స్మార్ట్ ఫోన్ కాదు.. అలా అనీ ఫీచర్ ఫోన్ కూడా కాదు.. ఇందులో ఫేస్ బుక్, వాట్సాప్, జియో ష్యూట్ యాప్స్ సపోర్ట్ చేసేలా ఇన్ బుల్ట్ ఉన్నాయి. 4G వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. రూ. 1,500 లోపు అతి తక్కువ బడ్జెట్ ఫోన్ కావాలంటే మాత్రం జియో ఫోన్ ఎంచుకోవచ్చు. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని రీఫండ్ చేసుకోవచ్చు. రూ.5 వేల లోపు బెస్ట్ ఫోన్లలో జియో ఫోన్ కూడా ఒకటిగా చెప్పువచ్చు.
ఫీచర్లు + స్పెషిఫికేషన్లు :
Screen Size | : | 2.4″ (240 x 320) |
Camera | : | 2 | 0.3 MP |
RAM | : | 512MB |
Battery | : | 2000 mAh |
Operating system | : | KAI OS |
Soc | : | SPRD 9820A/QC8905 |
Processor | : | Dual Core |
5. XIAOMI REDMI 7A :
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ సబ్ బ్రాండ్ Redmi నుంచి ఫోన్లలో ఇదొకటి.. Crafted by Amazon యూజర్ ఆఫర్ల కోసం ఈ మోడల్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. రూ.5వేల లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్లలో ఒకటిగా చెప్పవచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ తో వచ్చింది. లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇందులో 4G LTE ఆప్షన్ కూడా ఉంది. 18:9 డిస్ ప్లే అందించింది. 10.or D2 అనేది బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఒకటిగా పాపులర్ అయింది.
ఫీచర్లు + స్పెషిఫికేషన్లు :
Screen Size | : | 5.45″ (720 X 1440) |
Camera | : | 12 | 5 MP |
RAM | : | 2GB |
Battery | : | 4000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 439 |
Processor | : | octa |
ఫీచర్ల విషయానికి వస్తే.. 12MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 4000mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. 2GB ర్యామ్, ఆక్టా ప్రాసెసర్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 439 (SoC)తో పనిచేస్తుంది. అమెజాన్ ఇండియాలో ఈ మొబైల్ ధర రూ.5,999 ఉండగా.. ఫ్లిప్ కార్ట్ లో ధర రూ.6,499 నుంచి లభ్యమవుతోంది.