Top Smart TVs : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనేందుకు చూస్తున్నారా? కొత్త ఏడాదికి ముందే అమెజాన్‌లో అనేక బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కస్టమర్లు 32 అంగుళాల నుంచి 43 అంగుళాల వరకు టీవీలను కొనేసుకోవచ్చు. మీరు 50శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
2/5
ఈ టీవీల స్పెషల్ ఫీచర్ ఏమిటంటే.. మీరు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌తో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలన్నీ అద్భుతమైన ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో వస్తాయి. పవర్‌ఫుల్ డాల్బీ ఆడియో సపోర్టుతో అత్యుత్తమ డిస్‌ప్లేలను అందిస్తాయి. మీరు కూడా కొత్త టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇందులో మీకు నచ్చిన టీవీని కొనేసుకోండి.
3/5
VW విజన్ వరల్డ్ (32 అంగుళాలు) ఆప్టిమాక్స్ సిరీస్ HD రెడీ స్మార్ట్ QLED ఆండ్రాయిడ్ టీవీ : VW QLED ఆండ్రాయిడ్ టీవీ, అమెజాన్ ఇండియాలో 59 శాతం తగ్గింపుతో కేవలం రూ. 7799 కు కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 18999, మీరు రూ. 500 ఫ్లాట్ డిస్కౌంట్, రూ. 389 క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. అంతే కాదు.. రూ. 378 ఈఎంఐతో లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఎడ్జ్‌లెస్ డిజైన్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, 20-వాట్ సరౌండ్ సౌండ్‌తో వస్తుంది.
4/5
ఫిలిప్స్ (32 అంగుళాలు) 6100 సిరీస్ ఫ్రేమ్‌లెస్ HD స్మార్ట్ LED గూగుల్ టీవీ : ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ 32-అంగుళాల సైజులో వస్తుంది. ధర రూ. 22999, 52 శాతం తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత మీరు రూ. 10999కి కొనుగోలు చేయవచ్చు. రూ. 500 ఫ్లాట్ డిస్కౌంట్‌తో కూడా లభిస్తుంది. అదనంగా, రూ. 549 క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. అంతే కాదు, 60Hzరిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, డాల్బీ ఆడియోతో వస్తుంది.
5/5
షావోమీ (43 అంగుళాల) FX ప్రో QLED అల్ట్రా HD 4K స్మార్ట్ ఫైర్ టీవీ : ఈ షావోమీ టీవీ 43-అంగుళాల సైజులో వస్తుంది. మీరు ఈ టీవీని రూ. 49,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ ధర 50శాతం తగ్గింపుతో రూ. 24,999కి లభిస్తుంది. అదనంగా, రూ. 2,000 ఫ్లాట్ డిస్కౌంట్, రూ. 1,249 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అంతే కాదు, మీరు ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లో కొనుగోలు చేయవచ్చు. 32GB స్టోరేజ్, పవర్‌ఫుల్ డాల్బీ ఆడియోతో కూడా వస్తుంది.