Top Car Discounts : కొత్త కార్లు భలే ఉన్నాయి చూశారా? రూ. 5 లక్షల్లోపు సరసమైన స్టైలీష్ కార్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం..!

Top Car Discounts : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల బడ్జెట్ ధరలో మీకు నచ్చిన కారు కొనేసుకోండి.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Car Discounts

Top Car Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో సరసమైన ధరలో కొత్త కారు కొనడం కష్టమే. కానీ, మీ బడ్జెట్ రూ. 5 లక్షలు అయితే భారతీయ మార్కెట్లో కొన్ని సరసమైన ధరలో కొత్త కార్లు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్లు, స్టయిల్ రెండింటిలోనూ బెస్ట్ అని చెప్పొచ్చు.

ఈ కార్లు ముఖ్యంగా మొదటిసారి కొనుగోలు చేసేవారికి చిన్న కుటుంబాలకు, సిటీ డ్రైవ్ ప్రియులకు సరిగ్గా సరిపోతాయి. మీ జర్నీ మరింత ఈజీగా ఉండేందుకు రూ. 5 లక్షల లోపు టాప్ కార్లు ఏంటో ఓసారి తెలుసుకుందాం.. ఇందులో మీకు నచ్చిన కారు ఎంచుకుని కొనేసుకోవచ్చు.

మారుతి సుజుకి ఆల్టో K10 :
మారుతి సుజుకి ఆల్టో K10 కారు ఒక లీటర్ K-సిరీస్ ఇంజిన్ సిటీ డ్రైవ్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కలిగి ఉంది. కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఈజీగా ఎక్కడైనా పార్క్ చేయొచ్చు. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (టాప్ మోడల్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 5.96 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే.. మారుతి ఆల్టో K10 సగటున 24.39kmpl ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Top Car Discounts : మారుతి సుజుకి S-ప్రెస్సో :

మారుతి సుజుకి S-ప్రెస్సోను మినీ SUVగా వస్తుంది. లాంగ్ డిజైన్, బోల్డ్ లుక్ స్పెషాలిటీ. క్యాబిన్‌లో తగినంత స్పేస్ ఉంటుంది. ఎస్-ప్రెస్సో స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ ORVM వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. నెలకు జస్ట్ రూ. 222 డిపాజిట్ చేస్తే చాలు.. లక్షాధికారి అయిపోవచ్చు.. ఎలాగంటే?

ఈ కారు ధర రూ. 4.26 లక్షల నుంచి రూ. 6.12 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. మైలేజ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. సగటున 32.7kmpl మైలేజీ అందిస్తుంది.

టాటా టియాగో :
మీ బడ్జెట్‌ రూ. 5 లక్షలకు మించితే టాటా టియాగో బేస్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్. టాటా కార్లలో సెక్యూరిటీ, క్వాలిటీతో ఆకట్టకునేలా ఉంటాయి. టియాగో కూడా 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. మీరు హై వేరియంట్‌లలో iCNG టెక్నాలజీని కూడా పొందవచ్చు. స్టయిల్, సేఫ్టీ రెండింటినీ కోరుకునే కొనుగోలుదారులకు ఈ హ్యాచ్‌బ్యాక్ బెస్ట్.

రెనాల్ట్ క్విడ్ :
యువ కొనుగోలుదారుల కోసం 2025 రెనాల్ట్ క్విడ్ ప్రత్యేకంగా రూపొందించింది. SUV లాంటి స్టాన్స్, 279 లీటర్ల బూట్ స్పేస్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ మాన్యువల్, ఈజీ-ఆర్ ట్రాన్స్‌మిషన్‌తో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉంది.

అయితే, ధర రూ. 4.69 లక్షల నుంచి రూ. 6.45 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. డిజైన్, ఫీచర్ల కారణంగా తక్కువ ధరలో కొనుగోలు చేసేవారికి ఈ రెనాల్ట్ క్విడ్ కారు బెస్ట్ అని చెప్పొచ్చు.

మారుతి సుజుకి సెలెరియో :
ఈ మారుతి కారు సెలెరియో ధర రూ. 5 లక్షల కన్నా ఎక్కువగా ఉంటుంది. కానీ, పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లతో ధర రూ. 5 లక్షల లోపు ఉంటుంది. ఈ కారులో మైలేజ్ బెస్ట్ ఆప్షన్. ఆల్టో K10లో మాదిరిగా K-సిరీస్ ఒక లీటర్ ఇంజిన్ కూడా ఉంది. వైడ్ ఇంటీరియర్స్, ప్రాక్టికల్ డిజైన్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.