×
Ad

Best Royal Enfield Bikes : కొంటే ఇలాంటి బైక్ కొనాలి బ్రో.. పండగ సీజన్‌లో 5 బెస్ట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు మీకోసం.. ఏది కొంటారంటే?

Best Royal Enfield Bikes : కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో టాప్ 5 బెస్ట్ బుల్లెట్ బైకులను అందిస్తున్నాం. ఇందులో ఏది కొంటారో కొనేసుకోండి.

Best Royal Enfield Bikes

Best Royal Enfield Bikes : ఈ పండగ సీజన్‌లో కొత్త బైక్ తీసుకుందామని అనుకుంటున్నారా? బుల్లెట్ బైక్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో అద్భుతమైన బైకులు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ ప్రయాణాలు, వీకెండ్ ట్రిప్స్, లాంగ్ డ్రైవ్ వంటి వాటికి రాయల్ ఎన్‌ఫీల్డ్ పర్‌ఫెక్ట్ బైక్.

ఈ బ్రాండ్ ప్రస్తుత రేంజ్ అడ్వాన్స్ హార్డ్‌వేర్‌తో ప్రత్యేకంగా (Best Royal Enfield Bikes) ఆకట్టుకుంటుంది. ఇంజిన్ ఇంజెక్షన్, హై వేరియంట్‌లలో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్స్, గత జనరేషన్ల కన్నా మెరుగైన రైడ్ క్వాలిటీని అందిస్తుంది.

మీ రైడింగ్ ప్యాటర్న్, ఎత్తు, లగేజ్ అవసరాలకు ఈ బుల్లెట్ బైక్ తీసుకోవచ్చు. దీపావళి సేల్స్ సందర్భంగా ( క్యాష్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఫైనాన్స్) మీ లోకల్ డీలర్ల వద్ద చెక్ చేయండి. ఈ సేల్ సీజన్‌లో మీకోసం 5 అద్భుతమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన బుల్లెట్ బైక్ ఎంచుకుని కొనేసుకోండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 :

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అనేది ఆల్ రౌండర్ బైక్. రైడర్లు ఎక్కువగా ఇష్టపడే బైక్. ఆకర్షణీయమైన ఇంజిన్ ఉండటమే ఇందుకు కారణం. 349CC జే-ప్లాట్‌ఫారమ్ సింగిల్ ఇంజిన్‌తో వస్తుంది. ట్రాఫిక్‌ వంటి రద్దీ రోడ్లలో రైడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. రిలాక్స్డ్ ఎర్గోనామిక్స్, హ్యాండ్లింగ్, సీట్లు, లగేజ్, స్క్రీన్‌ల వంటి అప్లియన్సెస్ అత్యంత అనుకూలంగా ఉంటుంది. క్లాసిక్ 350 రోజువారీ ప్రయాణాలకు టైమ్‌లెస్ స్టైలింగ్‌ను అందిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 :
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ అనేది సిటీ రైడర్లకు అద్భుతంగా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత సౌకర్యవంతమైన బైక్.. ఎత్తు, వీల్‌బేస్ తక్కువగా ఉండటంతో రైడర్లు ఈ బైక్ కంట్రోల్ చేయడం చాలా సులభం. రద్దీగా ఉండే పట్టణ రోడ్లలో తక్కువ దూర ప్రయాణాలకు అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ వెయిట్ తక్కువ ఉండటంతో కొత్తగా బైక్ నేర్చుకున్న సిటీ రైడర్లకు సరైన బైక్ అని చెప్పొచ్చు.

Read Also : Apple iPhone 16 Price : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 :
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అడ్వెంచర్ రెడీ బైక్. అత్యంత కఠినమైన ట్రైల్స్ ఆఫ్-రోడ్ పరిస్థితులను తట్టుకునేలా ఉంటుంది. హిమాలయన్ 450 లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పవర్‌ప్లాంట్, లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, స్విచ్చబుల్ ఏబీఎస్,నిటారైన రైడింగ్ పొజిషన్‌ ఉంటుంది. దేశీయ రియల్ అడ్వెంచర్ బైక్‌ అని చెప్పొచ్చు. ఎక్కువ గంటలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఎక్కువ మొత్తంలో లగేజీని కూడా తీసుకెళ్లొచ్చు. కఠినమైన ఉపరితలాలపై సులభంగా దూసుకెళ్లొచ్చు. వీకెండ్ ట్రిప్ లేదా కఠినమైన ఉపరితలాలపై రైడింగ్ చేసేవారు అయితే హిమాలయన్ 450 బైక్ తీసుకోవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 :
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్‌లో పవర్‌ఫుల్ 648cc ఎరస్టైల్ ట్విన్ ఉంది. లెయిడ్ బ్యాక్ గేరింగ్, న్యూట్రల్ ఎర్గోనామిక్స్‌తో వస్తుంది. ఆల్ రౌండ్ రోడ్‌స్టర్‌ బైక్ సిటీ రైడర్లకు అద్భుతంగా ఉంటుంది. అలాగే హైవేపై కూడా ప్రత్యేకంగా ఉంటుంది. రోడ్లపై వేగంగా దూసుకుపోవచ్చు. ఈ బైకులో ఎల్ఈడీ లైటింగ్, అప్‌గ్రేడ్ స్విచ్‌గేర్ వంటి కొన్ని వేరియంట్‌లకు అల్లాయ్ వీల్స్, క్లాసిక్ అనలాగ్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటియోర్ 650 :
ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ సూపర్ మీటియర్ 650CC ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. లాంగ్, లోయర్ క్రూయిజర్ లేఅవుట్‌లో యూఎస్‌డీ ఫోర్కులు, వైడ్ బార్‌లు, ప్లష్ సీటింగ్‌తో వస్తుంది. ఈ బైక్ రోజంతా గంటకు 90 కి.మీ నుంచి 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఈ పెద్ద బైక్ తో హైవేలపై లాంగ్ డ్రైవ్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే సూపర్ మీటియర్ మీకు బెస్ట్ ఆప్షన్.