ఇతర దేశాలన్నింటి కంటే చైనాలో తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తుంటారు. అయినప్పటికీ, జపాన్ బ్రాండ్‌కు చెందిన ఓ కార్ చైనాలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.
టయోటా బిజెడ్ 3 ఎక్స్ కార్లు చైనాలో తాజాగా మార్కెట్లోకి వచ్చాయి. కేవలం రూ.13 లక్షలకు వస్తున్న ఈ కారును బుక్ చేసుకోవడానికి చాలా మంది ఒకేసారి ప్రయత్నించడంతో టయోటా బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయిపోయింది.
టాటా హారియర్ సైజులో ఉండే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం రూ.13 లక్షలకు మాత్రమే వస్తుందంటే దీన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. అందుకే ఇది చైనా బ్రాండ్ కాకపోయినప్పటికీ చైనీయులు తెగ బుకింగ్‌లు చేసుకుంటున్నారు.
బుకింగ్‌లు ప్రారంభించిన కేవలం గంట వ్యవధిలోనే 10,000 బుకింగ్‌లు వచ్చాయి. టయోటా BZ3X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని చైనా వాహన తయారీదారు జీఏసీ భాగస్వామ్యంతో తీసుకొచ్చింది. భారీగా బుకింగ్స్ వస్తుండడంతో బుకింగ్స్ సిస్టమ్ క్రాష్ అయిందని ఎంతగా దీని కోసం ఎగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
బ్యాటరీ పవర్ ఎంత?
430 ఎయిర్, 430 ఎయిర్+ మోడల్స్: ఇవి 50.03 kWh బ్యాటరీతో వచ్చాయి. పూర్తిగా ఛార్జ్ చేస్తే 430 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
520 ప్రో, 520 ప్రో+ మోడల్స్: ఇవి 58.37 kWh బ్యాటరీతో వచ్చాయి. పూర్తిగా ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
ఇక 610 మ్యాక్స్ టాప్ మోడల్ 67.92 kWh బ్యాటరీతో వచ్చింది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 610 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. బేస్ 430 ఎయిర్ మోడల్ ధరలు CNY 109,800 (సుమారు రూ. 13 లక్షలు) నుంచి ప్రారంభమవుతాయి.
టాప్ 610 మ్యాక్స్ మోడల్ ధరలు CNY 159,800 (సుమారు రూ.19 లక్షలు) వరకు ఉన్నాయి. ఎయిర్, ప్రో మోడళ్లు 204 bhp సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో వచ్చాయి. అయితే మాక్స్ మోడల్ మరింత శక్తిమంతమైన 224 bhp సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో వచ్చింది.
టయోటా bZ3X మిగతా ఫీచర్లు