Real Estate Scams : రియల్ ఎస్టేట్ మోసాలపై రేరా ఫోకస్

Real Estate Scams : రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తాము చేపడుతున్న ప్రాజెక్టుల్లో చేస్తున్న ఖర్చులు.. వస్తున్న లాభాలన్నీ ఒక అకౌంట్ ద్వారా మాత్రమే నిర్వహించాలి. వచ్చిన నిధులను ఎక్కువ శాతం వరకు అదే ప్రాజెక్టులో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

TS RERA Focus on Real Estate Scams in Hyderabad

రియల్టీ అక్రమాలపై రెరా ఫోకస్ పెట్టింది. కొనుగోలుదారులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రియాల్టీ రంగంలో మోసాలకు చెక్ పెట్టేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం పలు సంస్థలు చేపడుతున్న పలు ప్రాజెక్టులపై కూడా ఓ కన్నేసి ఉంచింది. ఎప్పటికప్పుడూ డెవలపర్ల నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకుంటుంది. గత నెలలో సమర్పించాల్సిన నివేదికలను వెంటనే ఇవ్వాల్సిందిగా రెరాలో నమోదు చేసిన సంస్థలను ఆదేశించింది.

Real Estate Scams : ఒక మంచి ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితకాలం పైసా పైసా కూడబెట్టి తమ కష్టార్జితాన్నంత తమ సొంతిటి కల సాకారం కోసం వెచ్చిస్తారు. మరికొందరైతే మంచి ఉద్యోగం వచ్చిందంటే చాలు.. భారీ మొత్తంలో ఈఎంఐలు చెల్లిస్తూ సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. అయితే ప్రాపర్టీలు కొనుగోలు సమయంలో చేసే చిన్న చిన్న తప్పులతో భారీగా నష్టపోతున్నారు పబ్లిక్‌. ఆ మోసాలకు చెక్‌ పెట్టేలా ప్రత్యేక నియంత్రణ సంస్థ తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ.. రెరా ఏర్పాటైంది.

Read Also : Real Estate East Hyderabad : మహానగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్టీ రంగం.. ఇన్వెస్ట్‌మెంట్‌కు బెస్ట్‌ చాయిస్‌గా ఈస్ట్‌ హైదరాబాద్‌!

మోసాలకు చెక్‌పెట్టే లక్ష్యంతో పనిచేస్తున్న రెరా :
కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొన్ని రియాల్టీ సంస్థలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుంటాయి. నిబంధనలకు నీళ్లు వదిలి..ప్రీ-లాంచ్ ఆఫర్… తక్కువ ధర అంటూ ప్రకటనలు గుప్పిస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని… భవిష్యత్తులో భారీగా రేట్లు పెరుగుతాయని ఊదరగొడుతుంటాయి..

బ్రోచర్స్‌లో గ్రాఫిక్స్ మాయాజాలం చూపిస్తారు.. ఒక ప్రాజెక్టులో ఆస్తులను అమ్మి వాటిని ఇతర ప్రాజెక్టుల్లో పెట్టి ఆ ప్రాజెక్టును ఆలస్యం చేస్తుంటారు. ఈ తరహా రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలానికి చెక్ పెట్టేందుకు రెరాలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. అందులో ముఖ్యమైనది త్రైమాసిక, వార్షిక నివేదికలు. రెరాలో నమోదైన సంస్థలన్నీ తమ ప్రాజెక్టుల అప్‌డేట్‌తో ఎప్పటికప్పుడూ ఈ నివేదికలను రెరాకు సమర్పిస్తున్నారు.

రెరా కట్టుదిట్టమైన చర్యలు :
ప్రతి ఏటా ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరిలో రెరాకు నివేదికలు సమర్పించాలి. ఆయా నెలల్లో 15వ తేదీనాటికి ఈ లెక్కలు సమర్పించకుంటే వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. అయినా నివేదికలు ఇవ్వకుంటే ఆయా సంస్థలపై రెరా చర్యలు తీసుకుంటుంది. వార్షిక నివేదికలు మాత్రం ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆరునెలల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి అంశాన్ని రెరా క్లియర్‌గా ఉంచడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రెరా ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.

రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తాము చేపడుతున్న ప్రాజెక్టుల్లో చేస్తున్న ఖర్చులు.. వస్తున్న లాభాలన్నీ ఒక అకౌంట్ ద్వారా మాత్రమే నిర్వహించాలి. వచ్చిన నిధులను ఎక్కువ శాతం వరకు అదే ప్రాజెక్టులో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టు పురోగతితోపాటు ఆదాయ, వ్యయాలను రెరా పరిశీలిస్తుంది. దీంతో ఆయా ప్రాజెక్టులు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇన్‌టైమ్‌లోనే కొనుగోలుదారులకు ప్రాపర్టీలను హ్యాండోవర్‌ చేస్తున్నాయి.

Read Also : Hyderabad Real Estate : రియల్ ఇన్‌కమ్.. టీ-సర్కార్‌కు కాసుల పంట.. భారీగా ఆదాయం ఇక్కడి నుంచే..!