Real Estate East Hyderabad : మహానగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్టీ రంగం.. ఇన్వెస్ట్‌మెంట్‌కు బెస్ట్ చాయిస్‌గా ఈస్ట్ హైదరాబాద్!
Real Estate East Hyderabad : హైదరాబాద్‌లో రియల్టీ రంగం వేగంగా విస్తరిస్తోంది. కొన్నేళ్లుగా హైదరాబాద్ వెస్ట్‌జోన్‌లో రియల్ ఎస్టేట్ కేంద్రీకృతమైంది. కొద్ది కాలం నుంచి రియల్ సంస్థలు, ప్రాపర్టీ బయ్యర్స్ ఈస్ట్ వైపు చూస్తున్నారు.

Real Estate East Hyderabad
Real Estate East Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఒక చోట ఓ ఇళ్లు కొనుగోలు చేయాలనేది సామాన్యుడి కల. జీవితాంతం కష్టపడిన డబ్బుకు కాస్త బ్యాంక్ లోన్ తీసుకుని తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేయడమంటే లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం. దాంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతుంది…? ఎక్కడ పెట్టుబడి పెడితే ఆ సొమ్ముకు మంచి రిటర్న్స్ వస్తాయి అని ఆలోచిస్తున్నారు పబ్లిక్. అంతే కాకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్‌కు బెస్ట్ చాయిస్ ఏది? తమ ఇన్వెస్ట్‌మెంట్‌కు భరోసాతో పాటు భారీ రిటర్న్స్ వస్తాయా? అనే కోణంలో ప్రజలు ప్లాన్ చేస్తున్నారు.
Read Also : Real Estate : హైదరాబాద్‌లో ఇళ్ల రిజిస్ట్రేషన్ల రికార్డు.. డిసెంబర్‌లో రూ. 2,340 కోట్లు
ఐటీ హబ్‌కు కేరాఫ్‌గా వెస్ట్ జోన్ హైదరాబాద్ :
హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐటీ హబ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ప్రాంతంలో అనేక రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ అయ్యాయి. అంతర్జాతీయ సంస్థల రాకతో వెస్ట్ జోన్‌తో పాటు ఓఆర్‌ఆర్‌కు సమీపంలోని భూముల ధరలు భారీగా పెరిగాయి. మౌలిక సదుపాయాలు భారీగా పెరగడంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్టీ రంగం ఫుల్ జోష్‌లో ఉంది. ప్రస్తుతం రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి, అలాగే సొంతింటి కలను నెరవేర్చుకునేవారికి “ఈస్ట్ హైదరాబాద్” ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిన తెలంగాణ సర్కార్ :
హైదరాబాద్ తూర్పు భాగంలో ఐటీ కంపెనీలు.., పరిశ్రమలు తీసుకువచ్చేలా కొన్నేళ్ల క్రితం తెలంగాణ సర్కార్ లుక్ ఈస్ట్ పాలసీ తీసుకువచ్చింది. ప్రస్తుతం వరంగల్ హైవే వైపు ఇండస్ట్రియల్ కారిడార్ వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, హయత్ నగర్, పోచారం, మేడిపల్లి, కీసర, రాంపల్లి వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం రాబోయే కాలంలో మరింత వృద్ధి చెందే చాన్స్ ఉందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో వాణిజ్య పరమైన ఆస్తులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ వెస్ట్‌జోన్‌తో పోలిస్తే ఈస్ట్ జోన్‌లో ప్రాపర్టీల ధరలు తక్కువగా ఉంది. దీంతో హైదరాబాద్ ఈస్ట్‌లో ప్రాపర్టీల క్రయవిక్రయాలు భారీగా పెరుగుతున్నాయి.
ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణ :
ఇక ఈస్ట్ జోన్‌లో ఇప్పటికే నాగోల్ వరకు మెట్రో రైల్ అందుబాటులో ఉంది. అక్కడ ఉన్న భగాయత్ లేఅవుట్, అలాగే మెట్రో డిపో వద్ద వాణిజ్య సముదాయాలకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా SRDPలో భాగంగా అనేక జంక్షన్లు ట్రాఫిక్ ఫ్రీ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణ కూడా ఈ ప్రాంతంలో రియల్టీ రంగ వృద్ధికి బూస్టింగ్‌లా పనిచేస్తోంది. దీంతో ప్రస్తుతం ఈస్ట్ హైదరాబాద్‌లో ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే భారీ రిటర్న్స్ ఖాయమంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్.
Read Also : Real Estate Investment: రియాల్టీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోన్న ప్రజలు