TRAI న్యూ రూల్స్: బిల్లు భారం.. OTT ప్లాట్‌ఫాంల‌కు బిగ్ బెనిఫెట్స్

ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ ప్రకారం.. డీటీహెచ్ కస్టమర్ల నుంచి లోకల్ కేబుల్ కస్టమర్లు వరకు తమకు ఇష్టమైన ఛానళ్లను ఎంచుకుంటూ పోతే నెలకు వారికి వచ్చే బిల్లు తడిసి మోపెడు అవుతుంది.

  • Publish Date - February 4, 2019 / 02:18 PM IST

ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ ప్రకారం.. డీటీహెచ్ కస్టమర్ల నుంచి లోకల్ కేబుల్ కస్టమర్లు వరకు తమకు ఇష్టమైన ఛానళ్లను ఎంచుకుంటూ పోతే నెలకు వారికి వచ్చే బిల్లు తడిసి మోపెడు అవుతుంది.

టెలివిజన్ ఛానళ్ల ప్రసారాలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ (TRAI) ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఇప్పటికే టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన ఛానళ్లను ఎంచుకొనే పనిలో పడ్డారు. ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ (TRAI Tariff Order) ప్రకారం.. డీటీహెచ్ కస్టమర్ల నుంచి లోకల్ కేబుల్ కస్టమర్లు వరకు తమకు ఇష్టమైన ఛానళ్లను ఎంచుకుంటూ పోతే నెలకు వారికి వచ్చే బిల్లు తడిసి మోపెడు అవుతుంది. ఇందులో పాపులర్ ఛానళ్లకు కలిసొచ్చే అంశమే. మెజార్టీ కస్టమర్లు పాపులర్ ఛానళ్లను తప్పకుండా తమ ప్యాకేజీలో ఎంచుకుంటారు. అన్ పాపులర్ టెలివిజన్ ఛానళ్లకు కష్టకాలమనే చెప్పాలి.  

పాపులర్ ఛానళ్లకే క్రేజ్..
ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ విధానంలో టెలివిజన్ ఛానళ్లను ఎంచుకుంటే పోతే వారికి నెలకొచ్చే బిల్లు భారీగా ఉంటుందని, పాపులర్ ఛానళ్లకు ఎంతో బెనిఫెట్ ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. నెట్ వర్క్ కెపాసిటీ ఫీ (NCF) కింద ఫీజు, ఛానెళ్లతో ఎక్కువ మంది టీవీ సబ్ స్ర్కైబర్లకు నెలవారీ బిల్లు పెరిగిపోతుందని రీసెర్చ్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ట్రాయ్ నిబంధనలతో సబ్ స్ర్కైబర్లందరూ స్వేచ్ఛగా తమకు నచ్చిన ఛానళ్లను ఎంచుకొనే అవకాశం లభించింది. ప్యాకేజీలు, ఒక్కో ఛానళ్లకు ఫీ కూడా బహిర్గతం చేయడంతో దాదాపు చాలామంది కస్టమర్లు తమకు నచ్చిన ఛానళ్లను ఎంచుకునేందుకు ఇష్టపడతారు.

నెలకు 25 శాతం.. రూ.300 వరకు బిల్లు
‘‘మా విశ్లేషణ ప్రకారం.. కస్టమర్ల నెలవారీ టీవీ బిల్లుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఛానళ్ల ధరపై నెల టీవీ బిల్లు 25శాతం పెరుగుతుంది. ఎవరైతే టాప్ 10 ఛానళ్లు ఎంచుకుంటారో వారికి రూ.230 నుంచి రూ.240 పెరుగుతుంది. అంటే.. మొత్తం మీద రూ.300 నెలకు బిల్లు చెల్లించాల్సి వస్తుంది. అదే టాప్ 5 ఛానళ్లు ఎంచుకుంటే మాత్రం ధర తగ్గిపోతుంది’’ అని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సచిన్ గుప్తా చెప్పారు. ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ అనే కొత్త నిబంధన బ్రాడ్ కాస్టింగ్ ఇండస్ట్రీ బలోపేతానికి దోహదపడుతుందని, ఇందులో  కంటెంటే కింగ్ (Content is King) కీలక రోల్ పోషిస్తుందని అన్నారు.   

బ్రాడ్ క్యాస్టర్లకు నెలకు 40 శాతం ఆదాయం
ప్రస్తుత బ్రాడ్ కాస్టర్ల రెవెన్యూ కంటే.. ట్రాయ్ కొత్త నిబంధనతో బ్రాడ్ క్యాస్టర్ల నెలవారీ రెవెన్యూ 40 శాతం వరకు పెరుగనుంది. ప్రస్తుతం రూ. 60-70 సబ్ స్ర్కిప్షన్ తో పోలిస్తే ఒక్కో సబ్ స్ర్కైబర్ నెలకు రూ. 94 లకు చేరింది. దీంతో బడా బ్రాడ్ క్యాస్టర్లు, పాపులర్ ఛానెళ్లకు డిమాండ్ పెరుగనుంది. డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లకు కొత్త నిబంధనలతో మిశ్రమంగా ఉండనుంది. ఓటీటీ (OTT) Netflix, Hulu, Amazon Prime Video, Hotstar వంటి మరెన్నీ ఓటీటీ ప్లాట్ ఫాంలకు భారీ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.

నెలవారీ సబ్ స్ర్కిప్షన్ బిల్లులు పెరిగే అవకాశం ఉండటంతో టీవీ ప్రేక్షకులంతా OTT ప్లాట్ ఫాం వైపుకు మళ్లీ అవకాశాలు ఉన్నాయి. అందులోనూ OTT ప్లాట్ ఫాంల్లో తక్కువ డేటా టారిఫ్ లు ఉండటంతో టీవీ ప్రేక్షకులు దీనిపైనే ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉందని నితేశ్ జైన్ తెలిపారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు NCF ఫీ కింద నెలవారీ బిల్లు రూ.130 తప్పనిసరి. పాపులర్ పే ఛానళ్లపై కూడా బ్రాడ్ క్యాస్టర్లు అందించే ధర కూడా నెలకు రూ.19 వరకు ఉంది. 

Read Also:  ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు

Read Also:  జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ

Read Also:  RBI గుడ్ న్యూస్ : హోంలోన్ పై EMI ఎంత తగ్గుతుందో తెలుసుకోండి

Read Also:  వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..

Read Also:  డిజిటల్ రాజకీయం: ‘పొలిటికల్ యాడ్స్‌’పై ఫేస్‌బుక్ కొత్త టూల్

Read Also:  ఫీచర్స్ సూపర్ అంట : జియో 3 కమింగ్ సూన్