Blue Tick: ముందుకు.. వెనక్కి.. మళ్లీ ముందుకు.. బ్లూటిక్‭పై ట్విట్టర్ దోబూచులాట

ప్రస్తుతం యాపిల్, వన్ ప్లస్ ఫోన్లు వాడుతున్న ట్విట్టర్ ఖాతాదారులకు చార్జీలతో కూడిన సందేశాలు రావడంతో అందరు అవాక్కయ్యారు. భవిష్యత్ లో యూజర్ చార్జీల కింద వీటిని వసూలు చేసేందుకు మస్క్ తప్పనిసరి చేయడం గమనార్హం. బ్లూ టిక్ యూజర్లు సందేశాలు వచ్చిన వారు వాటిని స్క్రీన్ షాట్లు తీసి ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. ఇందులో నెలవారీ చార్జీ 719 రూపాయలుగా కనిపించడం విశేషం. ఇక మీదట బ్లూటిక్ ఉన్న ఖాతాదారులు నెలనెలా డబ్బులు చెల్లించాల్సిందే

Twitter starts rolling Official Badge again as $8 verified ticks create chaos on the site

Blue Tick: బ్లూటిక్‭పై ట్విట్టర్ దోబూచులాడుతోంది. ముందుగా 8 డాలర్లకు పెయిడ్ బ్లూటిక్‭ వెరిఫికేషన్ సౌకర్యం కల్పించిన ట్విట్టర్.. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. అయితే ఇది గడిచి 24 గంటలు కూడా గడవకముందే మళ్లీ పెయిడ్ బ్లూటిక్ వెరిఫికేషన్‭ను పునరుద్ధరించింది. ప్రస్తుతం ఇది యాపిట్, వన్ ప్లస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉన్న యాపిట్, వన్ ప్లస్ యూజర్లకు ఇది కనిపించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.

నిజానికి ట్విట్టర్‭లో బ్లూటిక్ ప్రొఫైల్ అనేది చాలా పాపులర్. ఎక్కువ మంది సెలెబ్రిటీలు మిగతా సోషల్ మీడియా వేదికల కంటే ట్విట్టర్‭నే ఎక్కువగా వాడుతుండడంతో దీనికి మరింత ప్రాధాన్యం పెరిగింది. గతంలో ఇది కొన్ని నిబంధనలకు అనుగుణంగా ఇచ్చేవారు. అయితే ట్విట్టర్‭ను మస్క్ సొంతం చేసుకున్నాక.. బ్లూటిక్‭ను అమ్మకానికి పెట్టారు. నెలకు 8 డాలర్లు చెల్లిస్తే ఎవరికైనా బ్లూటిక్ వెరిఫికేషన్ చేస్తున్నారు.

ప్రస్తుతం యాపిల్, వన్ ప్లస్ ఫోన్లు వాడుతున్న ట్విట్టర్ ఖాతాదారులకు చార్జీలతో కూడిన సందేశాలు రావడంతో అందరు అవాక్కయ్యారు. భవిష్యత్ లో యూజర్ చార్జీల కింద వీటిని వసూలు చేసేందుకు మస్క్ తప్పనిసరి చేయడం గమనార్హం. బ్లూ టిక్ యూజర్లు సందేశాలు వచ్చిన వారు వాటిని స్క్రీన్ షాట్లు తీసి ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. ఇందులో నెలవారీ చార్జీ 719 రూపాయలుగా కనిపించడం విశేషం. ఇక మీదట బ్లూటిక్ ఉన్న ఖాతాదారులు నెలనెలా డబ్బులు చెల్లించాల్సిందే. ఒకవేళ డబ్బు చెల్లించలేం అనుకుంటే బ్లూటిక్ రద్దు చేసుకోవచ్చు.

ట్విట్టర్‭లో అనేక మార్పులు తీసుకురానున్నట్లు కొద్ది రోజుల క్రితం మస్క్ ప్రకటించారు. అందులో భాగంగా మొదట చేసిన మార్పు పెయిడ్ బ్లూటిక్. ఈ ప్రతిపాదనకు అనుగుణంగానే కొద్ది రోజుల్లోనే అనేక మంది ఖాతాదారులకు బ్లూటిక్ అందించారు. సాంకేతిక కారణాలు సహా మరిన్ని విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయంపై గురువారం వెనక్కి తగ్గినప్పటికీ.. కొన్ని మార్పులతో దీన్ని మళ్లీ పునరుద్ధరించినట్లు యాజమాన్యం పేర్కొంది.

Chikoti Praveen-MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌ని కలిసిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ .. మతమార్పిడులు చేసేవారి తోలు తీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు