Chikoti Praveen-MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌ని కలిసిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ .. మతమార్పిడులు చేసేవారి తోలు తీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు

బెయిల్ పై విడుదల అయిన ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌ని కలిసారు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్. రాజాసింగ్ హిందూత్వవాది అయిన అందుకే ఆయన్ని కలవటానికి వచ్చాయనని తెలిపారు. ఈ సందర్భంగా చికోటీ ప్రవీణ్ మాట్లాడుతూ..బలవంతంగా మతమార్పిడులు చేసేవారి తోలు తీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Chikoti Praveen-MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌ని కలిసిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ .. మతమార్పిడులు చేసేవారి తోలు తీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు

Casino King Chikoti Praveen met Ghoshamahal MLA Rajasingh

Updated On : November 11, 2022 / 3:33 PM IST

Casino King Chikoti Praveen-MLA Rajasingh : బెయిల్ పై జైలు నుంచి విడుదల అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసారు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్.హైదరాబాద్ లోని కోఠి ఇసామియా బజార్ లోని సంతోషి మాత ఆలయంలో చికోటి ప్రవీణ్ కుమార్ పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి చికోటి ప్రవీణ్ వెళ్లారు. రాజాసింగ్ ను పలకరించారు. క్షేమ సమాచారాలు అడిగారు. రాజాసింగ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అనంతరం చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ..రాజాసింగ్ హిందూత్వ వాది..హిందూ ధర్మాన్ని పరిరక్షించటం కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి..నేను కూడా హిందుత్వవాదినే..అందుకే ఓ హిందూత్వవాదిగా ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలవడానికి వచ్చానని తెలిపారు. రాజా సింగ్ కు నా మద్దతు ఉంటుందని..హిందూ ధర్మం కోసం పోరాడే వారందరికీ అండగా ఉంటానని చికోటి ప్రకటించారు.

గత కొంతకాలంలో బలవంతపు మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని..బలవంతంగా మతమార్పిడులు చేసేవారి తోలు తీస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు క్యాసినో కింగ్. తాను ఎవ్వరికి భయపడనను హిందూ ధర్మం కోసం పాటుపడే వ్యక్తిగా తోటి హిందూత్వ వాదులకు అండగా ఉంటానని తెలిపారు. ఇటీవల కాలంలో నాపై ఈడీ దాడులు జరిగాయని ఈడీ కేసులకు భయపడను.. నా వ్యాపారం నేను చేసుకుంటూ పోతా
నని స్పష్టంచేశారు క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్.

సిరిసిల్లలో కేటీఆర్ మీద పోటీ చేస్తారనే వార్తలు రావటంపై కూడా ఈ సందర్భంగా చికోటి స్పందించారు. కేటీఆర్ మీద పోటీ చేస్తా అనేది కేవలం పుకార్లు మాత్రమేనని.. ప్రస్తుతం ఏ పార్టీలోనే చేరే ఆలోచన నాకులేదని తెలిపారు.
అలాగే ఇటీవల వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చికోటీ ప్రవీణ్ ను కలిసారు. ఆయనతో చాలాసేపు మాట్లాడారు. వీరిద్దరి భేటీపై చికోటీ మాట్లాడుతూ..ఆర్జీవి నా కథను సినిమాగా తీసే ఆలోచనలో ఉన్నారని తామిద్దరం కలిసి మాట్లాడినప్పుడు ఆయన అన్నారని తెలిపారు. వర్మ పిలిచి తనకు సినిమాల్లో ఆఫర్ ఇస్తే నటిస్తానని కానీ సినిమాకు నిర్మాతగా మాత్రం వ్యవహరించను అంటూ పలు విషయాలను వెల్లడించారు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్.