Uber charges more from users if their phone battery is low, report claims
Uber Cab Fare Charges : రైడ్-హెయిలింగ్ కంపెనీ ఉబర్ (Uber) కస్టమర్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తోందట.. ఉబర్ క్యాబ్ బుకింగ్ చేసుకున్న కస్టమర్ల ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంటే మాత్రం వారి నుంచి ఎక్కువ ఛార్జీలను బాదుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతాయి. ఉబర్ క్యాబ్ బుక్ (Uber Cab Booking) చేసుకున్న ఒక కస్టమర్ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నందుకు క్యాబ్ ఛార్జీల (Uber Cab Charges) ను పెంచిందని ఓ నివేదిక తెలిపింది.
బెల్జియన్ వార్తాపత్రిక (Dernière Heure) అధ్యయనం ప్రకారం.. 84 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉన్న ఫోన్‌తో బుకింగ్ చేసిన అదే ప్రయాణంతో పోలిస్తే.. కేవలం 12 శాతం బ్యాటరీ మిగిలి ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో చేసిన ప్రయాణానికి 6 శాతం ఎక్కువగా ఉబర్ కంపెనీ వసూలు చేసింది. ఐఫోన్ (iOS), ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించి బుకింగ్ చేసేటప్పుడు ఉబర్ ఛార్జీలలో తేడాలు కనిపించినట్టు నివేదిక తెలిపింది.
ఉబర్ అదనపు ఛార్జీలపై బ్రస్సెల్స్‌లో అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో బుకింగ్ చేసిన రెండు డివైజ్‌ల్లో ఒకే రకమైన అభ్యర్థనలు ఉన్నాయని గుర్తించారు. యాప్ వినియోగదారు బ్యాటరీని అంచనా వేయలేకపోతుందనే వాదనలను ఉబర్ కొట్టిపారేసింది. బెల్జియన్ వార్తాపత్రిక డెర్నియర్ హ్యూర్‌లోని నివేదిక ప్రకారం.. బ్రస్సెల్స్‌లోని కస్టమర్ల బ్యాటరీ శాతం ఆధారంగా రైడ్-హెయిలింగ్ అప్లికేషన్ దాని ధరలను మార్చింది. బ్రస్సెల్స్ కార్యాలయం నుంచి సిటీ కోర్‌లోని టూర్ & టాక్సీలకు టాక్సీని రెండు ఐఫోన్‌లతో పరిశోధించింది.
అందులో ఒకటి 84 శాతం బ్యాటరీతో ఉండగా, మరొకటి 12శాతం బ్యాటరీతో నమోదైంది. 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ. 1,585) ఛార్జీలు విధించగా.. 84 శాతం బ్యాటరీ ఉన్న ఫోన్‌కు అదే ట్రిప్‌కు 16.60 యూరోలు (రూ. 1498) ఛార్జ్ చేయడంతో ధరల్లో వ్యత్యాసాన్ని నివేదిక వెల్లడించింది. అయితే, వినియోగదారు ఫోన్ బ్యాటరీ స్థాయి ఆధారంగా ధరను నిర్ణయిస్తుందనే ఆరోపణలను ఉబర్ తీవ్రంగా ఖండించింది.
Uber Cab Fare Charges : more from users if their phone battery is low, report claims (Photo : Google Images )
ఫోన్ బ్యాటరీ లెవల్స్‌ను ఉబర్ పరిగణనలోకి తీసుకోదు :
ఉబర్ ఛార్జీలపై వస్తున్న ఆరోపణలను ఉబర్ తిరస్కరించింది. వినియోగదారు ఫోన్ బ్యాటరీ స్థాయిని ఈ యాప్ గుర్తించలేదని కంపెనీ తెలిపింది. ఒక టూర్ ధరను లెక్కించడానికి ఉబర్ ఫోన్ బ్యాటరీ లెవల్‌ను ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోదని (Uber) పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. ఉబర్ రైడ్‌ల కోసం ప్రస్తుత డిమాండ్, రైడ్ అభ్యర్థనను అంగీకరించే డ్రైవర్ల లభ్యత ఆధారంగా డైనమిక్ ధర ఉంటుందని ఉబర్ కంపెనీ స్పష్టం చేసింది. వినియోగదారు ఫోన్ బ్యాటరీ లైఫ్ దుర్వినియోగం చేసినట్లు ఉబర్‌పై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2016లో, కంపెనీ ఆర్థిక పరిశోధనా విభాగం మాజీ హెడ్ కీత్ చెన్ ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై ప్రస్తావించారు.
వినియోగదారులు ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని ఉబర్ గుర్తించిందని చెప్పారు. కస్టమర్ల ఫోన్ బ్యాటరీ లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ధరలను పెంచుతుందనే ఆరోపణలను ఆయన ఖండించారు. అలాంటప్పుడు.. ఉబర్ కస్టమర్ల ఫోన్ బ్యాటరీ లెవల్స్ ఎందుకు పర్యవేక్షిస్తోంది అనే దానిపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉబర్ రైడ్ ధరను నిర్ణయించడానికి బ్యాటరీ స్థాయి వంటి యూజర్ల వ్యక్తిగత డేటాను ఉపయోగించే నైతికతపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటాను ఉపయోగించడం యూజర్ల ప్రైవసీ ఉల్లంఘనకు దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపైనే ఉబర్ ధర విధానాల పారదర్శకతపై కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కానీ, ఉబర్ కంపెనీ మాత్రం.. కస్టమర్ల పట్ల పారదర్శకంగానే వ్యవహరిస్తోందని చెబుతోంది. ఫోన్ బ్యాటరీ ఛార్జ్ లెవల్స్ ఆధారంగా అదనపు ఛార్జీలను కస్టమర్లపై బనాయిస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను ఉబర్ తీవ్రంగా ఖండిస్తోంది.