Twitter Tweet Limit : ట్విట్టర్‌లో ఇకపై 10వేల క్యారెక్టర్ల వరకు ట్వీట్ చేయొచ్చు.. వారికి మాత్రమే.. మళ్లీ ఫిట్టింగ్ పెట్టిన మస్క్..!

Twitter Tweet Limit : ట్విట్టర్ యూజర్లకు అలర్ట్.. ట్విట్టర్ అకౌంట్లో ఇకనుంచి 10వేల క్యారెక్టర్ల వరకు ట్వీట్ చేయొచ్చు.. బోల్డ్, ఇటాలిక్ టెక్స్ట్ ఫార్మాట్లలో మీకు నచ్చిన విధంగా ట్వీట్ పెట్టవచ్చు. కానీ, వారికి మాత్రమేనట.. మస్క్ ఏది అంత ఈజీగా ఇవ్వడుగా..

Twitter Tweet Limit : ట్విట్టర్‌లో ఇకపై 10వేల క్యారెక్టర్ల వరకు ట్వీట్ చేయొచ్చు.. వారికి మాత్రమే.. మళ్లీ ఫిట్టింగ్ పెట్టిన మస్క్..!

Now you can tweet up to 10k characters, with bold and italicised texts

Updated On : April 14, 2023 / 9:53 PM IST

Twitter Tweet Limit : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) యూజర్లకు అలర్ట్.. ట్విట్టర్ యూజర్ల కోసం టెక్స్ట్-ఫార్మాటింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత విస్తరించేందుకు సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. ఈ ప్లాట్ ఫారంలో చేసే ఒక్కో ట్వీట్ గరిష్ట సంఖ్యలో అక్షరాల పరిమితిని ట్విట్టర్ పెంచేసింది. ఇక నుంచి ట్వీట్ 10,000 అక్షరాల పొడవు, బోల్డ్, ఇటాలిక్ ఫార్మాటింగ్‌ సపోర్టు చేస్తుందని ట్విట్టర్ బాస్ సీఈఓ, ఎలన్ మస్క్ (Elon Musk) ఒక ప్రకటనలో వెల్లడించారు.

ట్విట్టర్ యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా అదనపు ఫీచర్లను కూడా అందిస్తోంది. అయితే, ఈ ఫీచర్లను యాక్సస్ చేయాలంటే మాత్రం ట్విట్టర్ బ్లూ టిక్ (Twitter Blue Tick) సబ్‌స్ర్కిప్షన్ పొంది ఉండాలి. అంతేకాదు.. ట్విట్టర్ నెలవారీ ప్లాన్‌లో సభ్యత్వం పొందిన యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌లో ‘మానిటైజేషన్’ ప్రొగ్రామ్ కూడా అందిస్తోంది.

బోల్డ్, ఇటాలిక్ టెక్స్ట్ ఫార్మాటింగ్‌తో ట్వీట్ క్యారెక్టర్ లిమిట్ 10వేల అక్షరాల వరకు పెంచినట్టు ట్విట్టర్ ప్రకటించింది. మార్చి 6న ఎలన్ మస్క్ ట్వీట్ లిమిట్ 10వేలకి విస్తరించే దిశగా ట్విట్టర్ పనిచేస్తోందని పేర్కొన్నారు. లాంగ్‌ఫార్మ్ ట్వీట్‌లను త్వరలో 10 వేలకు విస్తరిస్తామని ఆయన చెప్పారు. ఈ ఫీచర్ ద్వారా ట్విటర్ బ్లూ టిక్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని మస్క్ బాంబు పేల్చారు. మస్క్ ఏది ఫ్రీగా ఇవ్వడనే విషయాన్ని మరోసారి రుజువైంది. ట్వీట్ లిమిట్ పెంచినట్టే పెంచి.. బ్లూ టిక్ చెల్లించే యూజర్లు మాత్రమే యాక్సస్ చేసుకోగలరంటూ కొత్త ఫిట్టింగ్ పెట్టాడు.

Read Also : Tweet Characters Increase : ట్విటర్ లో యూజర్లకు కొత్తగా మరో ఫీచర్.. ట్వీట్ లో అక్షరాల సంఖ్య 10 వేలకు పెంపు!

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉంది. ట్విట్టర్ యూజర్లు వెబ్‌సైట్, మొబైల్‌లో వరుసగా రూ. 650, రూ. 900 చొప్పున సబ్‌స్ర్కైబ్ చేసుకోవచ్చు. వార్షిక సబ్‌స్ర్కైబర్లు రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు. తద్వారా రూ. 7,800కి బదులుగా రూ.6,800 చెల్లించాలి. ఈ ఫీచర్ ద్వారా ట్వీట్లను ఎడిట్ చేయడం, లాంగ్ వీడియోలను పోస్ట్ చేయడం, 50 శాతం తక్కువ యాడ్స్ కనిపించేలా చేయడంతో పాటు కొత్త ఫీచర్లకు అడ్వాన్స్ యాక్సెస్ పొందడం వంటి మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ట్వీట్లను పోస్ట్ చేసిన 30 నిమిషాలలోపు 5 సార్లు ఎడిట్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.

Now you can tweet up to 10k characters, with bold and italicised texts

Twitter Tweet Limit : Now you can tweet up to 10k characters, with bold and italicised texts

అంతకుముందు.. ట్విట్టర్ యూజర్లు తమ ఫాలోవర్లకు లాంగ్ ఫారమ్ టెక్స్ట్, లాంగ్ వీడియో కంటెంట్‌కు మాత్రమే సబ్‌స్క్రిప్షన్‌లను అందించనున్నట్టు మస్క్ ప్రకటించారు. ఈ ప్లాన్ ప్రకారం.. సబ్‌స్క్రిప్షన్‌ను పొందే యూజర్లు ఆండ్రాయిడ్, iOS వంటి ఛార్జీల ప్లాట్‌ఫారమ్‌లు కాకుండా చందాదారులు చెల్లించే మొత్తం డబ్బును పొందవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మొదటి 12 నెలల వరకు ఎలాంటి కోత విధించదు. గత అక్టోబరులో ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి ఆదాయాన్ని పెంచే పనిలో పడ్డారు మస్క్.

అదే ప్రయత్నంలో కంపెనీలో విస్తృతమైన సంస్కరణలను మస్క్ ప్రవేశపెట్టారు. ట్విట్టర్ ప్లాట్‌ఫారంను 44 బిలియన్లతో టేకోవర్ చేసిన సమయంలో ట్విట్టర్ యాడ్స్ ఆదాయం భారీగా పడిపోయింది. ట్విట్టర్‌ను గాడిలో పెట్టేందుకు కంపెనీ ట్విట్టర్-వెరిఫైడ్ బ్లూ టిక్‌ను పేమెంట్ సర్వీసును ప్రకటించింది. కంపెనీలోని ఉద్యోగులను దాదాపు 80శాతం తగ్గించింది. ట్విట్టర్‌లో కొత్త మార్పులపై ఉద్యోగులతో పాటు కొంతమంది నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఇప్పటికే ట్విట్టర్‌ను వదిలి Koo వంటి ఇతర సోషల్ ప్లాట్ ఫారంలకు వెళ్లిపోతున్నారు.

Read Also : Twitter Blue Tick : ట్విట్టర్ లెగసీ అకౌంట్లలో బ్లూ టిక్‌‌‌కు ‘4/20’ లాస్ట్ డేట్.. ఈ తేదీనే మస్క్ ఎందుకు ఎంచుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!