×
Ad

Union Budget 2026 : బడ్జెట్‌ 2025లో టాక్స్ పేయర్లకు 5 భారీ ప్రకటనలు.. ఈసారి బడ్జెట్‌లోనూ బిగ్ రిలీఫ్ ఉంటుందా? ఫుల్ డిటెయిల్స్

Union Budget 2026 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి అనేక ముఖ్య ప్రకటనలు చేశారు. అవేంటో ఓసారి వివరంగా చూద్దాం..

Union Budget 2026 5 Big Taxpayer-Friendly Announcements (Image Credit To Original Source)

  • ఫిబ్రరి 1నే కేంద్ర వార్షిక బడ్జెట్
  • ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్
  • పన్నుచెల్లింపుదారుల కోసం 5 కీలక ప్రకటనలు
  • రూ. 12 లక్షల వరకు ఆదాయంపై నో టాక్స్
  • రూ. 75వేల వరకు స్టాండర్డ్ డిడెక్షన్ లిమిట్

Union Budget 2026 : అందరి చూపు ఇప్పుడు బడ్జెట్ వైపే.. రాబోయే బడ్జెట్ లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయా? అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌పై పన్ను చెల్లింపుదారులు భారీ అంచనాలు పెట్టుకున్నారు . ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్‌లో కూడా పన్ను చెల్లింపుదారుల కోసం అనేక కీలక ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలన్నీ కూడా కొత్త ఆదాయపు పన్ను విధానానికి సంబంధించినవి.

వాస్తవానికి, కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఆకర్షణీయంగా పన్ను విధానాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన మార్పులను చేస్తూ వస్తోంది. ఈసారి కూడా అదే స్థాయిలో ఉపశమనం అందించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్ 2025ను పరిశీలిస్తే 5 కీలక ప్రకటనలు చేశారు. ఈసారి బడ్జెట్ లో కూడా ఇదే తరహాలో ప్రకటనలు ఉంటాయా? అనేది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 12 లక్షల వరకు ఆదాయం పన్ను లేదు :
ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్‌ సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు అద్భుతమైన ప్రకటన చేశారు. సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుందని ఆమె ప్రకటించారు.

అంటే.. జీతం పొందే వ్యక్తులు స్టాండర్డ్ డిడెక్షన్ కారణంగా ఇకపై రూ. 75వేల వరకు ఏడాదికి రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 12 లక్షల వరకు ఈ పన్ను రహిత ఆదాయం కొత్త ఆదాయపు పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుందని గమనించాలి.

Read Also : Volvo EX60 EV : జెమిని AIతో నడిచే వరల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ఈ సూపర్ కారు మనలా మాట్లాడగలదు..10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 400 కి.మీ రేంజ్!

రూ. 4 లక్షల స్టాండర్డ్ డిడెక్షన్ లిమిట్ :
గత కేంద్ర బడ్జెట్‌లో ప్రాథమిక మినహాయింపు పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచారు. అంటే.. రూ. 4 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు కొత్త పన్నువిధానం కింద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆదాయపు పన్ను శ్లాబులలో మార్పులు :
2025 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం అనేక పన్ను శ్లాబులలో కీలక మార్పులను ప్రకటించింది. కొత్త పన్ను విధానంలో ఇప్పుడు రూ.4 లక్షల వరకు ఆదాయంపై పన్ను జీరోగా ఉంటుంది. రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను విధిస్తుంది.

రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 10 శాతం. రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 15 శాతం, రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 25 శాతం, రూ.24 లక్షల కన్నా ఎక్కువ ఆదాయంపై పన్ను 30 శాతంగా ఉంటుంది.

నాలుగేళ్ల వరకు రిటర్న్ ఫైలింగ్ :
గత ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్‌లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. పన్ను చెల్లింపుదారులు 4 ఏళ్ల పాటు అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను దాఖలు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. గతంలో, ఈ ఆప్షన్ రెండేళ్లకే పరిమితంగా ఉండేది.

అద్దెకు టీడీఎస్ పరిమితి పెంపు :
ఆర్థిక మంత్రి అద్దెదారులు, ఇంటి యజమానులకు బిగ్ రిలీఫ్ అందించారు. గతంలో టీడీఎస్ కోసం అద్దె పరిమితి రూ. 2.4 లక్షలు ఉండగా ఆ తర్వాత రూ. 6 లక్షలకు పెంచారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో కూడా పన్ను చెల్లింపుదారులకు గత ఏడాది మాదిరిగానే భారీ ఉపశమనం ఉంటుందని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టంపై కూడా నిర్మలా సీతారామన్ మరిన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

ఆదాయపు పన్ను చట్టం 2025 ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పన్ను నియమ నిబంధలను పన్నుచెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా అందించనుంది. అంతేకాదు.. పన్ను నియమాలలో ఎలాంటి ప్రాథమిక మార్పులు చేసే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా, అనేక పాత పన్నునియమాలను కూడా రద్దు చేసింది.