×
Ad

Union Budget 2026 : ఫస్ట్ టైమ్ ఇల్లు కొనేవారికి పండగే.. మీ సొంతింటి కల నెరవేరినట్టే.. ఈ బడ్జెట్‌లో 5 ప్రధాన ప్రయోజనాలివే..!

Union Budget 2026 : కొత్త ఇల్లు కొనాలని అనుకునేవారికి బడ్జెట్ ఎలా ఉండబోతుంది? ఈసారి బడ్జెట్‌లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Union Budget 2026 Home Buyers (Image Credit To Original Source)

  • 2026 బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం గంపెడు ఆశలు
  • మిడిల్ క్లాస్ వారికి సొంతంటి కల నెరవేరే అవకాశం
  • ఫస్ట్ టైం ఇల్లు కొనేవారికి అదృష్టమే

Union Budget 2026 : కొత్త ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి సొంతంటి కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత రోజుల్లో ఇల్లు కొనడం అనేది అతిపెద్ద సవాల్ అనే చెప్పాలి. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఇళ్ల రేట్లు ఆకాశనంటుతున్న వేళ ఫస్ట్ టైం కొత్త ఇల్లు కొనేవారికి కష్టంగా మారింది.

అయితే, ఇప్పుడు రాబోయే వార్షిక బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్ రంగం భారీగా ఆశగా పెట్టుకుంది. రాబోయే బడ్జెట్‌లో గృహ రంగానికి 5 ప్రధాన ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి ఫస్ట్ టైం ఇల్లు కొనేవారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితి పెంపు :
ప్రస్తుతం, గృహ రుణ వడ్డీకి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(b) కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు మినహాయింపు ఉంది. పెరుగుతున్న ఆస్తి ధరల కారణంగా ఈ పరిమితిని రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యతరగతి వారికి భారీగా ఆదాయాన్ని పెంచుతుంది. తద్వారా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది.

Union Budget 2026 First Time Home Buyers (Image Credit To Original Source)

సరసమైన ధరకే కొత్త ఇళ్లు :
ప్రస్తుతం రూ. 45 లక్షల వరకు ధర ఉన్న ఇళ్లను సరసమైనవిగా చెబుతారు. కానీ, మెట్రో నగరాల్లో (ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై), ఈ ధర వద్ద ఇళ్లు దొరకడం లేదు. అందుకే ఈ పరిమితిని రూ. 75 లక్షల నుంచి రూ.1 కోటి వరకు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తద్వారా మరిన్ని ఇళ్లు సరసమైన వర్గంలోకి రానున్నాయి. కొనుగోలుదారులు కూడా తక్కువ వడ్డీ రేట్లు, ప్రభుత్వ సబ్సిడీల నుంచి ప్రయోజనం పొందవచ్చు.

గృహ సబ్సిడీ ఉపసంహరణ :

క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS) గతంలో లక్షలాది మందికి సొంతంటి కలను నెరవేర్చింది. ఫస్ట్ టైం ఇల్లు కొనేవారికి మధ్యస్థ ఆదాయ గ్రూపు (MIG) కోసం వడ్డీ సబ్సిడీ పథకాన్ని రెన్యువల్ ఆప్షన్ లేదా విస్తరించే అవకాశం కనిపిస్తోంది. దాంతో సబ్సిడీ నెలవారీ ఈఎంఐల భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. అలాగే, తక్కువ, మధ్యస్థ ఆదాయ గ్రూపులకు ఇల్లు కొనేందుకు ఎక్కువ అవకాశం లభించనుంది.

Read Also : Mobile Prices Hike : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. మొబైల్ డేటా, కాలింగ్ ఇక కష్టమే.. ఎప్పటినుంచంటే?

నిర్మాణంలోని ఆస్తులపై జీఎస్టీ సంస్కరణలు :
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ కొనుగోలుదారులకు అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడం, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC)ని రెన్యువల్ చేయడం వల్ల ప్రాజెక్ట్ ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నారు. బిల్డర్లు ఐటీసీ ప్రయోజనాన్ని పొందితే వారు ఇంటి ధరలను తగ్గించే అవకాశం ఉంటుంది. తద్వారా ఇల్లు కొనేవారికి నేరుగా ప్రయోజనం కలుగుతుంది.

నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఫండ్ పొడిగింపు :
దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఈసారి బడ్జెట్‌లో స్పెషల్ విండో ఫర్ అఫర్డబుల్ అండ్ మిడ్-ఇన్కమ్ హౌసింగ్ ఎక్కువ నిధులు కేటాయించాలని భావిస్తున్నారు. అదే జరిగితే నిలిచిపోయిన ప్రాజెక్టులకు నిధులు అందుతాయి. లక్షలాది మంది గృహ కొనుగోలుదారులు తమ ఫ్లాట్‌లను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు.