Mobile Prices Hike : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. మొబైల్ డేటా, కాలింగ్ ఇక కష్టమే.. ఎప్పటినుంచంటే?

Mobile Prices Hike : జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా యూజర్లకు షాకింగ్ న్యూస్.. త్వరలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లు 15 శాతం వరకు పెరగనున్నాయి. ఈ పెంపు జూన్ 2026 నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Mobile Prices Hike : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. మొబైల్ డేటా, కాలింగ్ ఇక కష్టమే.. ఎప్పటినుంచంటే?

Mobile Prices Hike (Image Credit To Original Source)

Updated On : January 21, 2026 / 2:44 PM IST
  • మొబైల్ టారిఫ్ ధరలు పెరగనున్నాయా?
  • జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ మొబైల్ డేటా, కాలింగ్ ఛార్జీలు 
  • జూన్ 2026 నాటికి 15 శాతం పెరగనున్న మొబైల్ టారిఫ్ ధరలు

Mobile Prices Hike : మొబైల్ యూజర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఇకపై మొబైల్ ఫోన్లకు రీఛార్జ్ చేయడం కష్టమే.. ఎందుకంటే.. అతి త్వరలో మొబైల్ టారిఫ్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే జోరుగా ప్రచారం జరుగుతోంది. భారత టెలికం మార్కెట్లో కాలింగ్, మొబైల్ డేటా అత్యంత ఖరీదైనవిగా మారనున్నాయి. నివేదికల ప్రకారం.. టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను 15 శాతం వరకు పెంచబోతున్నట్టు తెలుస్తోంది.

వచ్చే జూన్ 2026 నాటికి టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది. అదే జరిగితే మొబైల్ రీఛార్జ్ ధరల భారం వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్తలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

15 శాతం పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు :
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు జూన్ 2026 నాటికి రీఛార్జ్ ప్లాన్‌లను మరో 15 శాతం పెంచాలని యోచిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. భారత మార్కెట్లో మొబైల్ డేటా కూడా బంగారం మాదిరిగానే ఖరీదైనదిగా మారుతోందని ఎక్స్ యూజర్లు మండిపడుతున్నారు.

Mobile Prices Hike

Mobile Prices Hike (Image Credit To Original Source)

టెలికాం కంపెనీలు మొదట్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు అతి చౌకైన ధరకే డేటాను అందించాయి. దాంతో భారతీయ టెలికం మార్కెట్లో 1.1 బిలియన్లకు పైగా మొబైల్ సబ్‌స్క్రైబర్లు పెరిగారు. దాంతో అప్పటినుంచి మొబైల్ ఇంటర్నెట్ అనేది అందరి జీవితాల్లో కీలకంగా మారింది.

Read Also : Google Pixel 10 Pro XL : అద్భుతమైన డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే.. ఎలాగంటే?

అయితే, రానురాను లాభాల కోసం టెలికం కంపెనీలు ధరలను పెంచుతూ పోతున్నాయి. హైస్పీడ్ 5జీ నెట్‌వర్క్‌లు అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. అందులోనూ వినియోగదారు ఆదాయం (ARPU) కూడా చాలా తక్కువగా ఉందని కంపెనీలు వాపోతున్నాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో టారిఫ్‌లను పెంచాల్సి వస్తుందని చెబుతున్నాయి.

సాధారణంగా జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను నిర్ణయిస్తున్నాయి. అయితే, అకస్మాత్తుగా 15శాతం టారిఫ్ పెరుగుదల అంటే సాధారణ వినియోగదారులకు చాలా కష్టమే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వంటి ప్రభుత్వ సంస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటివరకు, మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపుపై టెలికాం దిగ్గజాలు ఎలాంటి ప్రకటన చేయలేదు.