ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు? అందరి ఆశలు మధ్యంతర బడ్జెట్ పైనే..

మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్ లో ఆశించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

Interim Budget 2024

Interim Budget 2024 Expectations : గురువారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ రానున్న కేంద్ర బడ్జెట్ అంచనాలను ప్రతిబింబించేలా ఉంటుందన్నది ఆర్థిక విశ్లేషకుల అంచనా. దీంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.

ఎన్నికలు అయ్యేంతవరకు ప్రభుత్వ పాలన నడవటానికి, ప్రస్తుతం ఉన్న పథకాలు కొనసాగేందుకు, అత్యవసరాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఈ మధ్యంతర బడ్జెట్ అమల్లో ఉంటుంది. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్ లో ఉండే అటువంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్ లో ఆశించవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read : లోక్‌సభ ఎన్నికల ముందు బడ్జెట్.. ఈ ఆసక్తికర అంశాలు తెలుసా?

సెక్షన్ 87ఏ కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న 7లక్షల రూపాయల నుంచి 8లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధింపులకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలిపి సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ ని ఈ బడ్జెట్ లో ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్ లో ఆశించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు