Xiaomi Smart Bands : వారెవ్వా.. షావోమీ కొత్త స్మార్ట్‌వాచ్‌లు వస్తున్నాయ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే.. ఫుల్ డిటెయిల్స్
Xiaomi Smart Band 10 Pro : షావోమీ కొత్త స్మార్ట్ వాచ్‌లు వస్తున్నాయి.. రాబోయే స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో సిరీస్ ఫీచర్లు లాంచ్ కు ముందుగానే లీక్ అయ్యాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- May 6, 2026 / 08:09 PM IST
Xiaomi Smart Band 10 Pro
- షావోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో భారీ రెక్టాంగులర్ డిజైన్ అందిస్తుంది
- ఈ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో 1.74-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉండొచ్చు
- 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్, ధరపై భారీ అంచనాలు
Xiaomi Smart Band 10 Pro : షావోమీ లవర్స్ కోసం అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌లు రాబోతున్నాయి. షావోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో అతి త్వరలో లాంచ్ చేయనుంది. షావోమీ వేరబుల్స్ రేంజ్ విస్తరించేందుకు చైనా దిగ్గజం రెడీ అవుతోంది. లాంచ్ కు ముందుగానే ఈ వేరబుల్ డివైజ్‌లకు సంబంధించి అనేక వివరాలను వెల్లడించింది.
ఈ షావోమీ స్మార్ట్ బ్యాండ్‌లో భారీ డిస్‌ప్లే, మెరుగైన డిజైన్, ఆప్షనల్ NFC సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. బ్యాటరీ లైఫ్, పలు కలర్ ఆప్షన్లకు సంబంధించి వివరాలు కూడా వెల్లడయ్యాయి. అయితే, ధర, లభ్యత వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. షావోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో గురించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
విన్‌ఫ్యూచర్ రిపోర్టు ప్రకారం..
షావోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో భారీ రెక్టాంగులర్ డిజైన్, క్యాప్సల్ షేప్ ప్యానెల్ ఉంటుంది. 480×400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.74-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఈ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో అల్యూమినియం బాడీతో వస్తుందని అంచనా.
ఈ బ్యాండ్ 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. నావిగేషన్ కోసం టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ బ్యాండ్ బ్లాక్, వైట్, రోజ్ కలర్ ఆప్షన్లలో వస్తుందని అంచనా. ఈ వేరబుల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది లేదా ధర ఎంత ఉంటుందో షావోమీ కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
కాంటాక్ట్‌లెస్ పేమెంట్లకు సపోర్టు :
స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో NFC, నాన్-NFC వెర్షన్లలో వస్తుందని కూడా నివేదిక పేర్కొంది. NFC వేరియంట్ కాంటాక్ట్‌లెస్ పేమెంట్లకు సపోర్టు ఇస్తుంది. రోజువారీ వినియోగానికి అద్భుతమైన ఆప్షన్. ఈ వెర్షన్ ధర స్టాండర్డ్ వెర్షన్ కన్నా కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు.
స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో బ్యాటరీ కెపాసిటీ ఇంకా వెరిఫై చేయలేదు. కానీ, 21 రోజుల వరకు వర్క్ చేస్తుందని రిపోర్టులు సూచిస్తున్నాయి. అయితే, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఆన్‌లో ఉన్నప్పుడు బ్యాటరీ స్పీడ్‌గా అయిపోతుంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఆన్‌లో ఉన్నప్పుడు వినియోగదారులు సుమారు 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు.
అధికంగా వాడితే 8 రోజులకు ఛార్జింగ్ తగ్గవచ్చు. ఈ బ్యాండ్‌లో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఉంటుందని అంచనా. స్మార్ట్ బ్యాండ్ 10 ప్రోలో హార్ట్ రేటు ట్రాకింగ్, మల్టీ స్పోర్ట్స్ మోడ్‌లు, ఇతర ఫిట్‌నెస్, హెల్త్ టూల్స్ కూడా ఉంటాయని అంచనా.
