Vivo V50e 5G
Vivo V50e 5G : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో V50e 5G భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 30వేల లోపు ధర పరిధిలోకి వచ్చే ఫోన్ కోసం మీరు చూస్తుంటే ఇదే మీకు మంచి అవకాశం. వివో ఇటీవల లాంచ్ చేసిన V50e 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
భారత మార్కెట్లో వివో V50E 5G ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ వివో ఫోన్ మొత్తం 2 స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది. వివో V50E 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ వివో ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. వివో V50E 5G ఆఫర్లు, ధర తగ్గింపు వివరాలను ఓసారి వివరంగా తెలుసుకుందాం.
వివో V50e 5G సేల్ :
వివో V50E స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. వివో V50E ఫోన్ తగ్గింపు ధరకే విజయ్ సేల్ అందిస్తోంది. అదనంగా, ఈ ఫోన్ వివో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.
వివో V50e ధర, డీల్స్ :
బ్యాంక్ డీల్ ద్వారా మీరు వివో V50e స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. HDFC, SBI బ్యాంక్ కార్డులపై 14శాతం తగ్గింపు లభిస్తుంది. మరోవైపు, మీరు 10శాతం ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
విజయ్ సేల్ సమయంలో 8GB, 128GB స్టోరేజ్ కలిగిన వివో V50e ఫోన్ ధర రూ.33,999 నుంచి రూ.28,999కి తగ్గింది.
అంటే.. ఈ వివో ఫోన్ ధర నేరుగా రూ.5వేలు తగ్గింది. కానీ, 8GB + 256GB వివో V50e మోడల్ ధర కూడా రూ. 5వేలు తగ్గింది. అసలు రూ.35,999 ఉండగా తగ్గింపు ధరతో ఈ ఫోన్ రూ.30,999కు లభ్యమవుతుంది. ఈ 2 వివో ఫోన్లలో సఫైర్ బ్లూ, పెర్ల్ వైట్ అనే 2 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
వివో V50e స్పెసిఫికేషన్లు :
6.77-అంగుళాల అమోల్డ్ క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ వివో V50e 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ అందిస్తుంది. స్క్రీన్ గరిష్టంగా 1800 నిట్‌ల ప్రకాశంతో పాటు 120Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. అలాగే వివో ఫోన్ ర్యామ్ 8GBకి పెంచవచ్చు.
మీడియాటెక్ డైమన్షిటీ 7300 SoC సీపీయూతో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15పైన ఫన్‌టచ్OS 15ని రన్ అవుతుంది. ఈ ఫోన్ IP68, IP69 సార్టింగ్‌ను కలిగి ఉంది. దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. HDR10+కి సపోర్టు ఇస్తుంది.
ఫోన్ బ్యాటరీ, కెమెరా విషయానికొస్తే.. ఇది 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. OISకి సపోర్టు ఇస్తుంది. అదనంగా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ బ్యాక్ కెమెరాతో వస్తుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 5600mAh బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో ఈ ఫోన్ 9 గంటలు ఛార్జ్ ఉంటుంది.