Atal Pension Yojana : ఈ అద్భుతమైన స్కీమ్‌లో పెట్టుబడితో నెలకు రూ. 5వేలు పెన్షన్ పొందొచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?
Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన పథకంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. నెలకు రూ. 5వేలు చొప్పున పెన్షన్ పొందొచ్చు. ఎలా అప్లయ్ చేయాలంటే?

Atal Pension Yojana
Atal Pension Yojana : ప్రధాని మోదీ ప్రభుత్వం పేద ప్రజలకు ఆర్థిక సాయం అందించేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో అటల్ పెన్షన్ పథకం ఒకటి. ఈ పథకం ప్రధాన లక్ష్యం పేద ప్రజలకు ఆర్థికంగా ఆదుకోవడమే. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
అటల్ పెన్షన్ యోజన కింద లబ్ధిదారుడు ప్రతి నెలా రూ. 5000 వరకు పొందుతారు. మీకు 60 ఏళ్లు నిండిన తర్వాత ఈ డబ్బు అందుతుంది.
తద్వారా మీ పదవీ విరమణ జీవితాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా గడపవచ్చు. మీరు వృద్ధాప్య పెన్షన్ ప్లాన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
అటల్ పెన్షన్ పథకం అంటే ఏంటి? :
అటల్ పెన్షన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పెన్షన్ పథకం. ఈ పథకం కింద లబ్ధిదారుడు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ పొందుతారు. ఈ పథకం ప్రత్యేకంగా పదవీ విరమణ చేసినవారికోసం రూపొందించారు.
ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక వ్యక్తి పదవీ విరమణ అనంతరం ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా ఉండవచ్చు. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడి వయస్సు 40 ఏళ్లకు మించకూడదు.
ఈ పథకానికి అర్హత ఏంటి? :
- దరఖాస్తుదారుడి వయస్సు 18 ఏళ్లు పైబడి 40 ఏళ్ల కన్నా తక్కువ ఉండాలి.
- దరఖాస్తుదారునికి KYC, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతా ఉండాలి.
- ఆ వ్యక్తి భారత పౌరుడై ఉండాలి.
- మీరు అటల్ పెన్షన్ యోజన కింద ప్రతి నెలా రూ. 210 పెట్టుబడి పెడితే.. మీరు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ పొందవచ్చు.
ఎలా అప్లయ్ చేయాలి? :
- మీరు అటల్ పెన్షన్ యోజనకు అప్లయ్ చేయాలంటే ఈ కింది విధంగా ఫాలో చేయండి.
- ముందుగా మీరు సమీపంలోని బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాలి.
- ఈ పథకానికి అప్లయ్ చేసేందుకు బ్యాంక్ అధికారి నుంచి ఫారమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
- ఫారమ్‌లో అవసరమైన సమాచారాన్ని నింపి డాక్యుమెంట్ సమర్పించండి.
- ఫారమ్ సమర్పించిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియను ప్రారంభమవుతుంది.
- ఫారమ్‌ను సమర్పించేటప్పుడు రూ. 1000 నుంచి రూ. 5000 మధ్య డిపాజిట్ చేయాలా అని అడుగుతారు.
మీరు ఏ ప్లాన్ ఎంచుకుంటారు? :
- ఆ తర్వాత కొన్ని రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఈ పథకానికి లింక్ అయింది.
- మీరు ఈ స్కీమ్ సులభంగా అప్లయ్ చేసుకోవచ్చు.