Vivo T3 Ultra : భలే ఉంది భయ్యా.. అతి తక్కువ ధరలో వివో T3 అల్ట్రా ఫోన్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు..!

Vivo T3 Ultra : వివో అభిమానుల కోసం వివో T3 అల్ట్రా ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Vivo T3 Ultra

Vivo T3 Ultra Discount : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. 256 స్టోరేజీ వేరియంట్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌ కొత్త సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధర కన్నా చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

Read Also : Samsung Galaxy S25 Price : పండగ చేస్కోండి.. ఇలా కొంటే శాంసంగ్ గెలాక్సీ S25 అతి తక్కువ ధరకే.. ఐఫోన్ కన్నా బెటర్ డీల్..!

మిడ్-బడ్జెట్ యూజర్ల కోసం వివో T సిరీస్ 256GB స్టోరేజీ, 5500mAh బ్యాటరీతో సహా ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఈ సిరీస్‌లో T3 అల్ట్రా ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.

వివో T3 అల్ట్రా డిస్కౌంట్ :
వివో T3 అల్ట్రా 3 స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 128GBతో 8GB ర్యామ్, 256GBతో 8GB ర్యామ్, 256GBతో 12GB ర్యామ్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభ ధర రూ.35,999గా ఉంది. ఈ సేల్ సమయంలో కేవలం రూ.27,999కే పొందవచ్చు. అదనంగా, రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.

ఈ డీల్స్‌తో వివో స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.25,999కే కొనుగోలు చేయొచ్చు. రూ.21,299 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. 256GB వేరియంట్‌ ధర రూ.29,999 ఉండగా బ్యాంక్ ఆఫర్‌ తర్వాత రూ.27,999కి తగ్గుతుంది. రూ. 2వేలు తగ్గింపు కూడా పొందవచ్చు.

వివో T3 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz హై రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఈ వివో ఫోన్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. వాటర్, డస్ట్ నుంచి సురక్షితంగా ఉంచుతుంది.

వివో T3 అల్ట్రాలో మీడియాటెక్ డైమన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్ ఉంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే FuntouchOSపై రన్ అవుతుంది.

మరో హైలైట్ ఏమిటంటే.. 5,500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, అడ్వాన్స్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. భద్రత పరంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Read Also : Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలు.. ఫుల్ డిటెయిల్స్..!

బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరాతో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా కూడా ఉంది.