Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలు.. ఫుల్ డిటెయిల్స్..!

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 కోసం చూస్తున్నారా? ఫీచర్లు, ధర వివరాలను కంపెనీ రివీల్ చేసింది.

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలు.. ఫుల్ డిటెయిల్స్..!

Nothing Phone 3

Updated On : May 14, 2025 / 11:36 AM IST

Nothing Phone 3 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? నథింగ్ బ్రాండ్ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించి నథింగ్ సీఈఓ కార్ల్ పీ ధర, లాంచ్ టైమ్‌లైన్ సహా కొన్ని కీలక వివరాలను వెల్లడించారు.

Read Also : iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16ప్రోపై ఏకంగా రూ. 14వేలు డిస్కౌంట్.. ఇలా చేస్తే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్..!

ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానెల్‌లోని ఇటీవలి వీడియోలో కూడా ఇదే విషయమై ఆయన ప్రస్తావించారు.రాబోయే నథింగ్ ఫోన్ 3 ధర దాదాపు £800 ఉంటుందని, ఈ వేసవిలో లాంచ్ అవుతుందని పెయ్ వెల్లడించారు.

ఈ ఫోన్ జూలై, సెప్టెంబర్ 2025 మధ్య ఎప్పుడైనా రావచ్చు. మునుపటి మోడల్స్ జూలై 2022లో నథింగ్ ఫోన్ (1), జూలై 2023లో నథింగ్ ఫోన్ (2) లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఈ నథింగ్ ఫోన్ “ప్రీమియం మెటీరియల్స్” కలిగి ఉంటుందని కూడా ఆయన ధృవీకరించారు. ముఖ్యంగా, నథింగ్ “ఫస్ట్ రియల్ ఫ్లాగ్‌షిప్” స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణించారు. నథింగ్ ఫోన్ 3 మెయిన్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఇతర వివరాలు ఇంకా రివీల్ చేయనప్పటికీ లీక్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
నథింగ్ ఫోన్ 3 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

హుడ్ కింద ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 3లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీలకు 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఫోన్ సర్కిల్ టు సెర్చ్, స్మార్ట్ డ్రాయర్, వాయిస్ ట్రాన్స్క్రిప్షన్, నథింగ్ ద్వారా ఇంటర్నల్ కస్టమ్-బిల్ట్ ఏఐ అసిస్టెంట్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది.

Read Also : Reliance Jio : జియో కస్టమర్లకు పండగే.. ఈ సింగిల్ ప్లాన్‌తో 336 రోజులు అన్ని ఫ్రీ.. నెలవారీ రీఛార్జ్ అవసరమే లేదు..!

భారత్‌లో నథింగ్ ఫోన్ 3 ధర (అంచనా) :
భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 3 ధర రూ.45వేల నుంచి రూ.50వేల మధ్య ఉంటుందని అంచనా. భారతీయ ధరను బ్రాండ్ ఇంకా రివీల్ చేయలేదు.