iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16ప్రోపై ఏకంగా రూ. 14వేలు డిస్కౌంట్.. ఇలా చేస్తే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్..!

iPhone 16 Pro : కొత్త ఐఫోన్ 16 ప్రో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ ఇలా సొంతం చేసుకోండి.

iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16ప్రోపై ఏకంగా రూ. 14వేలు డిస్కౌంట్.. ఇలా చేస్తే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్..!

iPhone 16 Pro

Updated On : May 14, 2025 / 10:43 AM IST

iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16 ప్రో అప్‌గ్రేడ్ చేయాలని అనుకుంటున్నారా? బెస్ట్ డీల్ కోసం చూస్తుంటే ఇదే సరైన అవకాశం.

Read Also : iOS 18.5 Update : ఆపిల్ లవర్స్‌కు పండగే.. iOS 18.5 అప్‌డేట్ ఆగయా.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుంది? డౌన్‌లోడ్ చేయండిలా..!

ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్రో ఆకర్షణీయమైన ధరకు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా ఐఫోన్ కొనుగోలుపై దాదాపు రూ. 14వేలు సేవ్ చేసుకోవచ్చు.

భారతీయ మార్కెట్లో రూ.1,19,900 ధరకు రిలీజ్ అయిన 128GB వేరియంట్ ట్రిపుల్ కెమెరా సెటప్, టైటానియం ఫ్రేమ్, సూపర్ రెటినా డిస్‌ప్లే, అనేక ఏఐ ఫీచర్లు వంటి ప్రీమియం స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.

ఈ ఫోన్ ఇప్పుడు రూ.1,05,000 తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మీకు ఆసక్తి ఉంటే.. విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్రో ధర :
ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16 ప్రో రూ.1,09,500 ధరకు వస్తుంది. రూ.1,19,500 నుంచి రూ.1,09,500 వరకు తగ్గింది. అంతేకాకుండా, HDFC కార్డులు సహా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కస్టమర్లు అదనంగా రూ.4,500 తగ్గింపు పొందవచ్చు. కొనుగోలుదారులు నెలకు రూ.5,214 నుంచి ఈఎంఐతో సహా అనేక ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.

కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలంటే.. వర్కింగ్ కండిషన్ బ్రాండ్ మోడల్‌ను బట్టి వాల్యూను పొందవచ్చు. కొనుగోలుదారులు రూ. 821 విలువైన 821 పాయింట్లను కూడా పొందవచ్చు. ఈ పాయింట్లతో ఇతర కొనుగోళ్లపై రీడీమ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల OLED ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది. ఆపిల్ సిలికాన్ A18 ప్రో చిప్‌సెట్ సపోర్టు ఇస్తుంది. ఈ ఐఫోన్ 15 ప్రో కన్నా మెరుగైన బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లను కలిగి ఉంది.

Read Also : Vivo V50 Elite Edition : వివో V50 ఎలైట్ ఎడిషన్ వచ్చేస్తోందోచ్.. కిర్రాక్ కెమెరా ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఈ ఐఫోన్ iOS 18.5లో రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఐఫోన్ డ్యూయల్ 48MP కెమెరా, 12MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా అందిస్తుంది.