Vivo V50 Elite Edition : వివో V50 ఎలైట్ ఎడిషన్ వచ్చేస్తోందోచ్.. కిర్రాక్ కెమెరా ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V50 Elite Edition : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో V50 ఎలైట్ ఎడిషన్ ఈ నెల 15న భారత మార్కెట్లోకి వస్తోంది.

Vivo V50 Elite Edition : వివో V50 ఎలైట్ ఎడిషన్ వచ్చేస్తోందోచ్.. కిర్రాక్ కెమెరా ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Updated On : May 13, 2025 / 11:34 AM IST

Vivo V50 Elite Edition : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన వివో రాబోయే వివో V50 ఎలైట్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు అధికారికంగా ధృవీకరించింది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. ఈ ఒక్క పని పూర్తి చేయకపోతే రూ. 2వేలు పడవు.. మీరు చేశారో లేదో చెక్ చేసుకోండి!

ఈ స్మార్ట్‌ఫోన్ మే 15 మధ్యాహ్నం అధికారికంగా లాంచ్ అవుతుంది. ఇప్పటికే వివో V50 సిరీస్ లైనప్‌లో అందుబాటులోకి రానుంది. ఇందులో ఇప్పటికే వివో V50, వివో V50e వంటి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

భారత ఫస్ట్ వివో ‘ఎలైట్ ఎడిషన్’ ఫోన్ :
వివో V-సిరీస్‌లో “ఎలైట్ ఎడిషన్” వేరియంట్‌ ఫస్ట్ టైమ్ తీసుకొస్తోంది. కెమెరా టెక్నాలజీ, ఆడియో పర్ఫార్మెన్స్‌ అప్‌గ్రేడ్‌లతో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందించడంపైనే ఫోకస్ పెడుతోంది.

ఫోటోగ్రఫీ క్వాలిటీ : జీస్ కెమెరాలతో ఇంజనీరింగ్ డిజైన్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంది. వివో, గ్లోబల్ జీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వివో V50 ఎలైట్ ఎడిషన్‌లో కెమెరా సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తుంది.

సాధారణ వివో V50 స్మార్ట్‌ఫోన్‌లో కనిపించే పిల్-ఆకారపు కెమెరా మాడ్యూల్‌లా కాకుండా ఈ మోడల్ బ్యాక్ ప్యానెల్‌లో ‘ఎలైట్ ఎడిషన్’ బ్రాండింగ్‌తో సర్కిల్ బ్యాక్ కెమెరా డిజైన్‌ను కలిగి ఉండవచ్చు.

వివో V50 ఎలైట్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
డిస్‌ప్లే : 6.77-అంగుళాల FHD+ క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే
ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఫన్‌టచ్ OS15 తో ఆండ్రాయిడ్ 15
ఫోటోగ్రఫీ : డ్యూయల్ 50MP బ్యాక్ కెమెరాలు, 50MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ : 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌
ప్రొటెక్షన్ : దుమ్ము, నీటి నిరోధకతకు IP68/IP69 రేటింగ్
స్పీకర్, సేఫ్టీ : స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

భారత్‌లో వివో V50 ధర (అంచనా) :
ప్రస్తుత వివో V50 ధర రూ.34,999 నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ మోడల్ ధర రూ.40,999కు కొనుగోలు చేయొచ్చు. వివో V50 ఎలైట్ ఎడిషన్ ధర డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్స్ బట్టి ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

వివో V50 ఎలైట్ ఎడిషన్‌తో బ్రాండ్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో ఫ్లాగ్‌షిప్ వంటి ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Zeiss ఆప్టిక్స్, సొగసైన డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్, హై-ఎండ్ అమోల్డ్ డిస్‌ప్లే వంటి పవర్‌ఫుల్ ఫీచర్లు, స్టయిల్, కంటెంట్ రెండింటినీ కోరుకునే యూజర్లకు పోటీదారుగా మారవచ్చు.

Read Also : Apple iPhone 15 : ఇది కదా డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 25వేలకే ఐఫోన్ 15.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!

అధికారిక లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ వివో V సిరీస్ లైనప్‌కు సంబంధించి ఈ ప్రీమియం ధరలను మే 15న రివీల్ చేయనుంది.