Apple iPhone 15 : ఇది కదా డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 25వేలకే ఐఫోన్ 15.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!
Apple iPhone 15 : ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఐఫోన్ 15 మోడల్ రూ. 25వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 15
Apple iPhone 15 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15 కొనుగోలుపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బచత్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ మే 14 వరకు కొనసాగుతుంది.
ఈ సేల్‌లో ప్రీమియం ఐఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ లేటెస్ట్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15 ధరలను భారీగా తగ్గించింది.
128GB, 256GB వేరియంట్‌లను అతి తక్కువ ధరలకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 15 ఆఫర్‌లను ఓసారి పరిశీలిద్దాం..
ఐఫోన్ 15పై డిస్కౌంట్ :
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 128GB వేరియంట్ ధర రూ. 69,900కు అందిస్తోంది. బిగ్ బచత్ డేస్ సేల్ సమయంలో 8 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ధర కేవలం రూ. 63,999కి తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులకు ఇన్‌స్టంట్ 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 3వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మరింత ఆదా చేసుకోవచ్చు. ఫుల్ ఎక్స్ఛేంజ్ విలువ రూ. 41వేల కన్నా ఎక్కువ సేవింగ్స్ అందిస్తుంది. ఈ ప్రీమియం ఫోన్‌ను రూ. 22,849 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరకు ఐఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని అసలు వదులుకోవద్దు.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 15 ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉన్నాయి. IP68 రేటింగ్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ సూపర్ రెటినా డిస్‌ప్లేను అందిస్తుంది.
200 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. బాక్స్ వెలుపల అప్‌గ్రేడ్‌తో iOS 17లో రన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ పరంగా పవర్‌ఫుల్ ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
6GB ర్యామ్, 512GB స్టోరేజీని కలిగి ఉంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 48MP, 12MP డ్యూయల్ రియర్ కెమెరాలను అందిస్తోంది. అయితే, 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ 3349mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.