Samsung Galaxy A55 : ఆఫర్ అదిరింది భయ్యా.. శాంసంగ్ గెలాక్సీ A55పై కిర్రాక్ డిస్కౌంట్.. ఈ బ్యాంకు ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే..!

Samsung Galaxy A55 : శాంసంగ్ ఫోన్ కావాలా? ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్లతో శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

Samsung Galaxy A55 : ఆఫర్ అదిరింది భయ్యా.. శాంసంగ్ గెలాక్సీ A55పై కిర్రాక్ డిస్కౌంట్.. ఈ బ్యాంకు ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే..!

Samsung Galaxy A55

Updated On : May 11, 2025 / 4:39 PM IST

Samsung Galaxy A55 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ బ్యాంకు ఆఫర్లతో అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది.

Read Also : OnePlus Nord 4 Price : ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై ఏకంగా రూ.25వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

మీరు కూడా శాంసంగ్ అభిమాని అయితే ఈ ఆకర్షణీయమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. మీరు ఈ బ్రాండ్ ఫోన్ కొనాలనుకుంటే మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో ప్రీమియం ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను ఈ-కామర్స్ షాపింగ్ సైట్ అమెజాన్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అనేక ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. మీరు తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A55 5Gపై బ్యాంక్ ఆఫర్ :
ధర విషయానికి వస్తే.. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ రూ.42999కి లిస్టు అయింది. కానీ, డిస్కౌంట్ తర్వాత అమెజాన్ నుంచి రూ.26,999కి కొనుగోలు చేయవచ్చు.

బ్యాంక్ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఉంటే.. మీకు రూ.1250 తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో, రూ.28450 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. అదే సమయంలో, కస్టమర్లకు రూ.1000 డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A55 5G స్పెషల్ ఫీచర్లు :
6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేను కలిగి ఉంది. రిజల్యూషన్ 2340×1080 పిక్సెల్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం.. ఈ శాంసంగ్ ఫోన్ Exynos 1480 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 వన్ యూఐ 6.1 ఆధారంగా రన్ అవుతుంది. ఐదు ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు 4 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్ అందిస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ LED ఫ్లాష్‌లైట్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 32MP కెమెరాతో వస్తుంది.

Read Also : Samsung Galaxy F06 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. రూ. 10వేల లోపు ధరకే ఈ 5G ఫోన్ కొనేసుకోండి..!

పవర్ విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 5000mAh పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. 25-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. Wi-fi, బ్లూటూత్, GPS, USB పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.