OnePlus Nord 4 Price : ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై ఏకంగా రూ.25వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!
OnePlus Nord 4 Price : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ. 25వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

OnePlus Nord 4 Price
OnePlus Nord 4 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీరు పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ (OnePlus Nord 4 Price) రూ. 30వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఆకర్షణీయైన డిస్‌ప్లే , అద్భుతమైన పర్ఫార్మెన్స్, డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లా కనిపిస్తుంది. సాధారణంగా రూ. 30వేల ధరలో ఉండగా ఈ హ్యాండ్‌సెట్ రూ. 25వేల లోపు ధరకే సొంతం కావచ్చు.
మీరు వన్‌ప్లస్ స్టోర్‌లో ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 5వేల వరకు ఆదా చేసుకోవచ్చు. స్టైలిష్ మెటాలిక్ బాడీని కలిగిన ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ఆకర్షణీయమైన డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డీల్‌పై ఆసక్తి కలిగి ఉంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు.
భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ధర :
ప్రస్తుతం వన్‌ప్లస్ స్టోర్‌లో రూ.29,499 ధరకు అందుబాటులో ఉంది. రూ.500 ధర తగ్గింపుతో పొందవచ్చు. అదనంగా, కస్టమర్లు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ.4,500 వరకు ఆదా చేసుకోవచ్చు. దాంతో ఈ వన్‌ప్లస్ నార్డ్ 4 ధర రూ.24,999కి తగ్గుతుంది.
మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలంటే.. ఫోన్ మోడల్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా వెబ్‌సైట్‌లో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మెర్క్యురియల్ సిల్వర్, అబ్సిడియన్ మిడ్‌నైట్, ఒయాసిస్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
కంపెనీ 6 నెలల పాటు నెలకు రూ.4,917 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. జియోప్లస్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ.2250 విలువైన బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 4 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ 4 6.74-అంగుళాల OLED ప్యానెల్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 2,150 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 చిప్‌తో పనిచేస్తుంది.
16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
Read Also : Broadband Plan : 400Mbps, 22 OTT యాప్స్, 300కి పైగా టీవీ చానళ్లు.. సరసమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మీకోసం..!
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.