Broadband Plan : 400Mbps, 22 OTT యాప్స్, 300కి పైగా టీవీ చానళ్లు.. సరసమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మీకోసం..!
Broadband Plan : కొత్త స్ట్రీమింగ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? 400Mbps, 22 ఓటీటీ యాప్స్, 300కిపైగా టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు..

Broadband Plan
Broadband Plan : స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం చౌకైన ధరకే ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మీరు OTT స్ట్రీమింగ్ సర్వీసుల కోసం చూస్తుంటే వివిధ యాప్‌లకు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
మీరు ఇప్పుడు సరసమైన ధరకు 400 Mbps వరకు హై-స్పీడ్ కనెక్టివిటీని పొందవచ్చు. చాలా మంది కొత్త అప్‌డేట్స్ కోసం న్యూస్ ఛానెల్‌లను ఫాలో అవుతుంటారు.
స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా కొత్త అప్‌డేట్స్ తెలుసుకోవడానికి హై-స్పీడ్ డేటా అవసరం. సరసమైన ధరకు 400Mbps ఇంటర్నెట్ స్పీడ్ అందించే ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీ స్మార్ట్‌ఫోన్‌లో OTT స్ట్రీమింగ్, యూట్యూబ్ వీడియోలు లేదా లైవ్ టీవీని వీక్షించవచ్చు. లో ఇంటర్నెట్ స్పీడ్ వల్ల వీడియోలు బ్లర్‌గా మారుతాయి. లేటెస్ట్ న్యూస్ స్పష్టంగా తెలుసుకోవడం కష్టమవుతుంది.
మీరు ఏదైనా వీడియో స్ట్రీమింగ్ లేదా న్యూస్ అప్‌డేట్స్ కోసం చూస్తుంటే.. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ చాలా అవసరం. బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో ప్రముఖ ప్లేయర్ ఎక్సిటెల్ లక్షలాది మంది కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.
OTT సబ్‌స్క్రిప్షన్లు :
ఎక్సిటెల్ కస్టమర్ల కోసం రూపొందించిన సరసమైన ప్లాన్‌లను అందిస్తుంది. ప్రతి నెలా మల్టీ OTT సబ్‌స్క్రిప్షన్ రీఛార్జ్‌లతో విసిగిపోయి పోతే ఇకపై ఆ ఆందోళన అక్కర్లేదు.
కంపెనీ ఇటీవల యూజర్ల కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్, 300 కన్నా ఎక్కువ టీవీ ఛానెల్‌లకు అదనంగా 18 కన్నా ఎక్కువ OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందించే ఆకట్టుకునే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
400Mbps ప్లాన్ :
మీరు గేమింగ్, OTT స్ట్రీమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్ ఎంచుకోవచ్చు. ఎక్సిటెల్ నెలకు కేవలం రూ. 734కే అద్భుతమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
400Mbps స్పీడ్‌తో పాటు కస్టమర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి పాపులర్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు స్టార్‌ప్లస్ HD, సోనీ HD, కలర్స్ HD వంటి 300+ లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయొచ్చు. నెలవారీ రుసుము GST కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఎక్సిటెల్ 200Mbps ప్లాన్ :
తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ కనెక్టివిటీని కోరుకునే వినియోగదారులకు 200Mbps ప్లాన్ నెలకు రూ. 554 ధరకు అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్ ZEE TV, Sony Entertainment, StarPlus, 300కి పైగా టీవీ ఛానెల్‌లను ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. Excitel కేబుల్ కట్టర్ ప్లాన్‌తో మీరు మల్టీ OTT సబ్‌స్క్రిప్షన్‌లతో పనిలేకుండా న్యూస్ ఛానెల్‌లను ఈజీగా యాక్సస్ చేయొచ్చు.