Retirement Plan : ఈ SWP స్కీమ్‌లో పెట్టుబడి పెడితే చాలు.. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. లక్ష సంపాదించొచ్చు.. ఇదిగో ఇలా..!

Retirement Plan : రిటైర్మెంట్ తర్వాత మ్యూచువల్ ఫండ్ల సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (SWP) నెలకు లక్షల ఆదాయం పొందొచ్చు. ఇంతకీ ఎలా పొందాలంటే?

Retirement Plan : ఈ SWP స్కీమ్‌లో పెట్టుబడి పెడితే చాలు.. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. లక్ష సంపాదించొచ్చు.. ఇదిగో ఇలా..!

Retirement Plan

Updated On : May 11, 2025 / 2:09 PM IST

Retirement Plan : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత నెలవారీగా ఆదాయం పొందాలంటే ఇలా చేయండి. మీరు కూడా వృథ్యాప్యంలో ఆర్థికంగా స్వతంత్రంగా జీవించవచ్చు.

మ్యూచువల్ ఫండ్ల సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (SWP) బెస్ట్ ఆప్షన్. ఈ ప్లాన్ ద్వారా మీ పెట్టుబడిపై ప్రతి నెలా కనీసం రూ. లక్ష సంపాదించవచ్చు.

Read Also : Atal Pension Yojana : ఈ అద్భుతమైన స్కీమ్‌లో పెట్టుబడితో నెలకు రూ. 5వేలు పెన్షన్ పొందొచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?

అయితే, SWP ప్రారంభించే ముందు భారీ మొత్తంలో డబ్బులను కూడబెట్టడం చాలా ముఖ్యమని గమనించాలి. ఈ ఫండ్‌ను కూడబెట్టేందుకు మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఎందుకంటే ఈ పథకాలు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తాయి. మొదట సరైన పెట్టుబడి పెట్టండి. ఆపై SWP ద్వారా నెలవారీగా ఆదాయాన్ని పొందండి.

ఇలా చేస్తే ప్రతి నెలా రూ. లక్ష సంపాదన :
ప్రతి ఏడాదిలో 12 శాతం నుంచి 15శాతం లాభాలతో అనేక మ్యూచువల్ ఫండ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక వ్యక్తి 21 ఏళ్లు ఉంటే రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి ప్రతి ఏడాదిలో 12శాతం రాబడిని అందిస్తే ఈ మొత్తం దాదాపు రూ. 1 కోటి 8 లక్షలకు పెరుగుతుంది.

ఈ విధంగా, ఒకసారి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ తర్వాత ఇంట్లో కూర్చొని ప్రతి నెలా రూ. లక్ష వరకు సంపాదించవచ్చు.

సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఏంటి? :
సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అనేది మీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బును క్రమంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ప్రతి నెలా ఎంత మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు ఏ తేదీన బదిలీ చేయాలో చెబుతుంది.

ఫండ్ నుంచి కొంత మొత్తం బయటకు వస్తూనే ఉంటుంది. కానీ, మిగిలిన డబ్బు అక్కడే పెట్టుబడి పెట్టబడి దానిపై వడ్డీ లేదా రాబడిని పొందుతూనే ఉండవచ్చు. మీరు కాంపౌండింగ్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

పదవీ విరమణ చేసిన లేదా ఉద్యోగం నుంచి విరామం తీసుకుంటున్న వారికి ఈ పద్ధతి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

Read Also : Vivo V50e 5G : భలే డిస్కౌంట్.. భారీగా తగ్గిన వివో V50e 5G ఫోన్.. మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్!

వార్షిక రాబడి 12శాతం ఉంటే.. ఒకసారి చేసిన రూ. 10 లక్షల పెట్టుబడి 21 ఏళ్లలో రూ. 1 కోటి 8 లక్షలకు పెరుగుతుంది. ఆ తరువాత మీరు SWP ద్వారా నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించవచ్చు.