iOS 18.5 Update : ఆపిల్ లవర్స్‌కు పండగే.. iOS 18.5 అప్‌డేట్ ఆగయా.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుంది? డౌన్‌లోడ్ చేయండిలా..!

iOS 18.5 Update : ఐఫోన్ 18.5 అప్‌డేట్ వచ్చేసింది. అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ కొత్త అప్‌డేట్ ఏయే ఐఫోన్లకు సపోర్టు చేస్తుందో తెలుసా? ఫుల్ లిస్టు మీకోసం..

iOS 18.5 Update : ఆపిల్ లవర్స్‌కు పండగే.. iOS 18.5 అప్‌డేట్ ఆగయా.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుంది? డౌన్‌లోడ్ చేయండిలా..!

iOS 18 5 Update

Updated On : May 13, 2025 / 2:00 PM IST

iOS 18.5 Update : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ యూజర్ల కోసం iOS 18.5 అప్‌డేట్ అధికారికంగా రిలీజ్ చేసింది. iPadOS 18.5. ఈ అప్‌డేట్ ఇప్పుడు అన్ని అర్హత కలిగిన ఐఫోన్లకు అందుబాటులో ఉంది.

ఐఫోన్ వినియోగదారులకు యాక్టివిటీ అప్‌గ్రేడ్స్, కొత్త మార్పులను సూచిస్తుంది. ఆపిల్ iOS 18.5 అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలను ఓసారి లుక్కేయండి.

Read Also : Apple MacBook Air M4 : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర తగ్గిందోచ్.. ఈ డీల్ ఇలా పొందొచ్చు!

iOS 18.5 ఫీచర్లు :
మెయిల్ యాప్‌లో ఆసక్తికరమైన మార్పులు వచ్చాయి. ఆపిల్ ఇప్పుడు యూజర్లను ఆల్ మెయిల్ ఇన్‌బాక్స్‌ను సులభంగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. మీరు కేటగిరీ ఇన్‌బాక్స్‌లు, మీ పూర్తి ఇమెయిల్ జాబితా మధ్య టోగుల్ చేయవచ్చు.

కొత్త త్రి డాట్స్ మెను యూజర్లకు ఇన్‌బాక్స్ నుంచే కాంటాక్ట్ ఫొటోలను చూపించడం లేదా హైడ్ చేయొచ్చు. ఆపిల్ ఐఫోన్‌ల కోసం కొత్త ప్రైడ్-బ్యాక్‌గ్రౌండ్ వాల్‌పేపర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఆపిల్ వాచ్ వినియోగదారులకు సరిపోయే ప్రైడ్ ఎడిషన్ వాచ్ బ్యాండ్ ఇప్పుడు అందుబాటులో ఉంది.

iOS 18.5తో, పేరెంట్స్, తమ పిల్లల స్క్రీన్ టైమ్ పాస్‌కోడ్‌ను ఎంటర్ చేసినప్పుడల్లా వారికి అలర్ట్ వస్తుంది. మానిటరింగ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. పిల్లలు స్క్రీనింగ్ టైమ్ లిమిట్ ఆప్షన్ ద్వారా సెట్ చేయొచ్చు.

మరో ఫీచర్ ఏమిటంటే.. ఆపిల్ టీవీ యాప్ కొనుగోలుతో అథెంటికేషన్ విస్తరించింది. ఇప్పుడు, వినియోగదారులు థర్డ్ పార్టీ స్మార్ట్ టీవీలు, స్ట్రీమింగ్ డివైజ్‌ల‌ కోసం ఆపిల్ టీవీ యాప్ ద్వారా నేరుగా కంటెంట్ అథెంటికేషన్ పూర్తి చేయొచ్చు.

ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌లో శాటిలైట్ కనెక్టివిటీని కూడా విస్తరించింది, గతంలో ఈ ఫీచర్ ఐఫోన్ 14, ఇతర కొత్త ఐఫోన్ మోడళ్లలో ఉండేది. ఐఫోన్ 13 వినియోగదారులు ఇప్పుడు లో సిగ్నల్ ఉన్న ప్రాంతాలలో మెరుగైన కనెక్టివిటీని పొందవచ్చు.

అర్హత గల డివైజ్‌లివే :
2018 తర్వాత రిలీజ్ అయిన అన్ని ఐఫోన్ మోడల్స్ సపోర్టు చేస్తాయి. ఇందులో iPhone XR, XS, XS Max, రెండు SE మోడల్‌లు, iPhone 16eతో సహా లేటెస్ట్ ఐఫోన్ 16 మోడల్స్ ఉన్నాయి.

Read Also : Samsung Galaxy S25 Edge : ఐఫోన్ 17 ఎయిర్‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్.. అల్ట్రా స్లిమ్ డిజైన్ కేక.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
మీ ఐఫోన్‌లో Settings > General > Software Update వెళ్లి ఆపై Update ఇన్‌స్టాలేషన్‌ను ఎనేబుల్ చేసి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ ఆప్షన్ ఎంచుకోండి. కొత్త అప్‌డేట్ దాదాపు 1.58GB సైజులో ఉంటే (ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఆధారంగా) Wi-Fiకి కనెక్ట్ అవ్వండి.