Samsung Galaxy S25 Edge : ఐఫోన్ 17 ఎయిర్‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్.. అల్ట్రా స్లిమ్ డిజైన్ కేక.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Samsung Galaxy S25 Edge : శాంసంగ్ S25 లైనప్‌లో అత్యంత ఆకర్షణీయమైన మోడల్ గెలాక్సీ S25 ఎడ్జ్‌ను అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో అధికారికంగా లాంచ్ చేసింది.

Samsung Galaxy S25 Edge : ఐఫోన్ 17 ఎయిర్‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్.. అల్ట్రా స్లిమ్ డిజైన్ కేక.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Samsung Galaxy S25 Edge

Updated On : May 13, 2025 / 1:32 PM IST

Samsung Galaxy S25 Edge : ఆపిల్‌కు పోటీగా శాంసంగ్ అత్యంత సన్నని మోడల్ గెలాక్సీ S25 ఎడ్జ్  రిలీజ్ చేసింది. ఎప్పటినుంచో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ సన్నని డిజైన్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేయాలని భావిస్తోంది.

ఐఫోన్ బ్రాండ్ కన్నా ముందే శాంసంగ్ ఈ గెలాక్సీ S25 ఎడ్జ్ అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో తీసుకొచ్చింది. శాంసంగ్ S25 లైనప్‌లో అత్యంత ఆకర్షణీయమైన మోడల్ గెలాక్సీ S25 ఎడ్జ్‌ను అధికారికంగా ప్రవేశపెట్టింది.

Read Also : Vivo V50 Elite Edition : వివో V50 ఎలైట్ ఎడిషన్ వచ్చేస్తోందోచ్.. కిర్రాక్ కెమెరా ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

కేవలం 5.8mm అల్ట్రా-స్లిమ్ ప్రొఫైల్‌తో ఈ శాంసంగ్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 200MP మెయిన్ సెన్సార్‌తో వస్తుంది.

గెలాక్సీ ఫోన్ల కోసం ప్రత్యేకంగా తయారైన కస్టమ్-ట్యూన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. కేవలం 163 గ్రాముల బరువుతో శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ టైటానియం ఫ్రేమ్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2, బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో వస్తుంది.

గెలాక్సీ S25 ఎడ్జ్ ధర, లభ్యత :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ మే 23, 2025 నుంచి అమ్మకానికి రానుంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర 1,099.99 డాలర్లు ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానున్నట్టు శాంసంగ్ ధృవీకరించింది.

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ డిస్‌ప్లే, డిజైన్ :
ఈ శాంసంగ్ ఫోన్ 6.7-అంగుళాల క్వాడ్ HD+ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 1Hz నుంచి 120Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. స్మూత్ స్క్రోలింగ్ అందిస్తుంది.

స్క్రీన్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. తేలికైన టైటానియం బిల్డ్, స్లిమ్ ఫారమ్‌తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ పోర్టబిలిటీ రెండింటినీ కోరుకునే యూజర్ల కోసం రూపొందించింది.

గెలాక్సీ S25 ఎడ్జ్ పర్ఫార్మెన్స్ :
శాంసంగ్ గెలాక్సీ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ కలిగి ఉంది. బేస్ S25 మోడళ్లలో కనిపించే అదే పవర్‌హౌస్ చిప్ కలిగి ఉంది. శాంసంగ్ ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ సన్నని వేపర్ చాంబర్ కలిగి ఉంది. థర్మల్ పర్ఫార్మెన్స్‌తో IP68-రేటింగ్‌ను కలిగి ఉంది.

గెలాక్సీ S25 ఎడ్జ్ కెమెరా సామర్థ్యాలు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌ ఫోటోగ్రఫీకి బెస్ట్ ఆప్షన్. 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. బేస్ S25 కన్నా 40శాతం వరకు లో లైటింగ్ అందిస్తుంది. ఆటోఫోకస్, మాక్రో ఫొటోగ్రఫీ సపోర్టుతో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది. ఫ్రంట్ సైడ్ వీడియో కాల్స్, సెల్ఫ్-పోర్ట్రెయిట్‌ల కోసం ఆప్టిమైజ్ 12MP సెల్ఫీ కెమెరా ఉంది.

గెలాక్సీ S25 ఎడ్జ్ సాఫ్ట్‌వేర్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ :
వన్ యూఐ 7తో ఆండ్రాయిడ్ 15 రన్ అయ్యే గెలాక్సీ S25 ఎడ్జ్, కాల్ ట్రాన్స్క్రిప్ట్, డ్రాయింగ్ అసిస్ట్, రైటింగ్ అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తుంది. గూగుల్ సర్కిల్ టు సెర్చ్‌ను కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. శాంసంగ్ 7 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

Read Also : Apple MacBook Air M4 : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర తగ్గిందోచ్.. ఈ డీల్ ఇలా పొందొచ్చు!

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ బ్యాటరీ లైఫ్, కనెక్టివిటీ :
హుడ్ కింద ఈ ఫోన్ 3900mAh బ్యాటరీని కలిగి ఉంది. 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. Wi-Fi 7, బ్లూటూత్ 5.4, 5G, NFC కలిగి ఉంటుంది.