Reliance Jio : జియో కస్టమర్లకు పండగే.. ఈ సింగిల్ ప్లాన్‌తో 336 రోజులు అన్ని ఫ్రీ.. నెలవారీ రీఛార్జ్ అవసరమే లేదు..!
Reliance Jio : రిలయన్స్ జియో మిలియన్ల మంది కస్టమర్లకు అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది.

Jio Annual Plan
Reliance Jio : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో తమ కస్టమర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. బేస్, వైడ్ రేంజ్ రీఛార్జ్ ప్లాన్‌లతో జియో ఆఫర్ల ద్వారా అనేక బెనిఫిట్స్ అందిస్తోంది.
నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయిన జియో కస్టమర్లకు ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. జియో రూ. 2వేల కన్నా తక్కువ ధరకే దాదాపు ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ కాలింగ్ అందించే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది.
జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ :
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల ప్రకారం.. జియో లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రధానంగా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లతో పాటు డేటాపై ఆధారపడే కస్టమర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర కేవలం రూ.1,748 ఉండగా 336 రోజులు లేదా దాదాపు 11 నెలల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ సింగిల్ రీఛార్జ్‌తో తరచూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఈ ప్లాన్‌లో మొత్తం 336 రోజులు అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు వినియోగదారులు ఫ్రీ ఎస్ఎంఎస్ నుంచి కూడా బెనిఫిట్స్ పొందొచ్చు.
ఈ ప్లాన్ వ్యవధిలో వినియోగదారులు లోకల్, STD నెట్‌వర్క్‌లలో మొత్తం 3,600 ఫ్రీ ఎస్ఎంఎస్ పొందొచ్చు. అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ జియో టీవీకి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉంటుంది. 50GB జియో క్లౌడ్ సర్వీసును కూడా అందిస్తుంది.
జియో 200 రోజుల ప్లాన్ :
మీరు లాంగ్ టైమ్ డేటా ప్లాన్ కోసం చూస్తుంటే.. జియో రూ.2,025 ఆప్షన్ ఎంచుకోండి. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఎక్కువ డేటా అవసరమయ్యే యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్.
200 రోజుల వ్యాలిడిటీతో యూజర్లు రోజుకు 2.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌కు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.