Vivo V40 Pro 5G
Vivo V40 Pro 5G : కొత్త కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన కెమెరా ఫోన్ కొనేసుకోవచ్చు.. ప్రస్తుతం అమెజాన్‌లో వివో V40 ప్రో (Vivo V40 Pro 5G) అతి తక్కువ ధరకే లభిస్తోంది.
బ్యాంక్ ఆఫర్లతో రూ. 13,139 తగ్గింది. ఈ వివో ఫోన్ భారతీయ మార్కెట్లో రూ. 49,999 ధరకు లాంచ్ కాగా, కెమెరా, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లేతో వచ్చింది. అమెజాన్‌లో వివో V40 ప్రో 5G డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వివో V40 ప్రో 5G ధర :
అమెజాన్‌లో వివో V40 ప్రో ధర రూ. 37,999కు లభిస్తోంది. లాంచ్ ధరతో పోలిస్తే రూ. 12వేలు తగ్గింది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఉంటే.. రూ. 1,139 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ధర రూ. 37వేల కన్నా తక్కువకు తగ్గుతుంది. ఈ డీల్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఫోన్‌పై మాత్రమేనని గమనించాలి.
బ్యాంక్ కార్డ్ బట్టి నెలకు రూ. 1,842 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆప్షన్ కూడా ఉంది. మీ పాత ఫోన్ కొత్త వివో V40 ప్రో కోసం ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 36,700 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఫోన్ వర్కింగ్ కండిషన్లు, మోడల్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
వివో V40 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
వివో V40 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా పొందుతుంది. హుడ్ కింద, మీడియాటెక్ డైమన్షిటీ 9200+ చిప్‌సెట్‌తో వస్తుంది. 5500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
IP68 సర్టిఫికేషన్‌ను పొందింది. కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ Zeiss-ట్యూన్ 50MP వైడ్ లెన్స్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ పొందుతుంది. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.