Back to Campus Sale : విద్యార్థుల కోసం బిగ్ సేల్.. ల్యాప్‌టాప్, కొత్త ట్యాబ్ ఏది కొన్నా తక్కువ ధరకే.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!
Back to Campus Sale : విద్యార్థులు కొత్త ల్యాప్‌టాప్, ట్యాబ్ కోసం చూస్తున్నారా? ఈ నెల 27వరకు పలు గాడ్జెట్లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి..

Back to Campus Sale
Back to Campus Sale : విద్యార్థుల కోసం అద్భుతమైన సేల్.. మీకు నచ్చిన గాడ్జెట్ కొనేసుకోవచ్చు.. ల్యాప్‌టాప్ నుంచి ట్యాబ్, గేమింగ్ యాక్ససరిస్ (Back to Campus Sale) వరకు ఏదైనా డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. సమ్మర్ సేల్ డిస్కౌంట్ తర్వాత కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది.
ఈ సీజన్ సమయంలో ఈ-కామర్స్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ విద్యార్థుల కోసం ‘బ్యాక్ టు క్యాంపస్’ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ జూన్ 21న ప్రారంభమైంది. జూన్ 27 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా విద్యార్థులకు టెక్నాలజీకి సంబంధించిన అనేక ముఖ్యమైన గాడ్జెట్లపై 30శాతం వరకు డిస్కౌంటుతో కొనుగోలు చేయవచ్చు. భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా పొందవచ్చు.
ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు :
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు : విద్యార్థులలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లకు అత్యధిక డిమాండ్ ఉంది. ఈ గాడ్జెట్‌లను భారీ డిస్కౌంట్లకు కొనుగోలు చేస్తున్నారు.
ఆడియో గాడ్జెట్స్, వేరబుల్ : ఎంఐవీఐ (Mivi) ఏఐ-ఆధారిత ఇయర్‌బడ్‌లు, బ్లూటూత్ స్పీకర్‌ల వంటి గాడ్జెట్‌లపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నాయి.
గేమింగ్, యాక్సెసరీలు : గేమింగ్ లేదా కంట్రోలర్లు, కీబోర్డులు, ప్రింటర్లు వంటి యాక్సెసరీలను కొనుగోలు చేస్తే.. 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
స్మార్ట్ పేమెంట్, సూపర్ కాయిన్స్ : మీరు ఎంపిక చేసిన ప్రొడక్టులపై సూపర్ కాయిన్స్ ఉపయోగిస్తే.. ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో జెన్-ఏఐ ఆధారిత చాట్ సపోర్ట్, వీడియో అసిస్టెన్స్, గైడెడ్ ప్రొడక్ట్ టూల్స్‌ను కూడా చేర్చింది. తద్వారా రిటైలర్లు సరైన ప్రొడక్టును సులభంగా ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ‘బ్యాక్ టు క్యాంపస్’ సేల్ విద్యార్థులను మాత్రమే కాకుండా హైబ్రిడ్ లెర్నింగ్, డిజిటల్ లైఫ్ స్టయిల్ కూడా మరింత పెంచుతోంది.
అత్యధికంగా అమ్ముడైన గాడ్జెట్‌లు :
మే 2025 నాటి చివరి సేల్ ప్రకారం.. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు బెస్ట్ సెల్లింగ్ సెగ్మెంట్‌లుగా నిలిచాయి. అమ్మకాల్లో శాంసంగ్, వన్‌ప్లస్ బ్రాండ్‌లే ఎక్కువగా ఉన్నాయి. గేమింగ్ టాబ్లెట్‌లు, పవర్ బ్యాంక్‌లకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మొత్తం కొనుగోళ్లలో 50శాతం టైర్-2, టైర్-3 నగరాలే ఉన్నాయి. డిజిటల్ స్మార్ట్ డివైజ్‌లకు డిమాండ్ మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. ఇతర ప్రాంతాలకు కూడా అమ్మకాలు విస్తరించాయి.