BSNL Recharge Plans : BSNL కస్టమర్ల కోసం టాప్ 3 చీపెస్ట్ ప్లాన్లు.. ప్రారంభ ధర రూ. 99 మాత్రమే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

BSNL Recharge Plans : బీఎస్ఎన్ఎల్ 3 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్, 50GB డేటాను పొందవచ్చు.

BSNL Recharge Plans : BSNL కస్టమర్ల కోసం టాప్ 3 చీపెస్ట్ ప్లాన్లు.. ప్రారంభ ధర రూ. 99 మాత్రమే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

BSNL

Updated On : June 25, 2025 / 7:13 PM IST

BSNL Recharge Plans : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండగే.. చౌకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీల కన్నా సరసమైన ధరకే BSNL అనేక రీఛార్జ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. మీరు BSNL కస్టమర్ అయితే.. 3 సరసమైన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ BSNL ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ డేటాతో పాటు అనేక ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

BSNL రూ. 229 ప్లాన్ : 
బీఎస్ఎన్ఎల్ ప్లాన్ 30 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ విషయానికొస్తే.. ఏ నంబర్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌ పొందవచ్చు. వినియోగదారులు రోజువారీ 2GB హై-స్పీడ్ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రతిరోజూ 100 ఫ్రీ SMS కూడా పొందవచ్చు. స్పీడ్ 40Kbpsకి అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు.

Read Also : Best Cars India : లైఫ్‌లో ఫస్ట్ టైం కారు కొంటున్నారా? సేఫ్టీ ఫీచర్లు, మైలేజీ అందించే బెస్ట్ కార్లు ఇవే.. మీ బడ్జెట్ ధరలోనే..!

BSNL రూ.153 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ.153 ప్లాన్ 26 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఏ నంబర్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ వినియోగానికి మొత్తం 26GB డేటా ఉంటుంది. ఈ ప్లాన్ రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. 26GB డేటా దాటాక అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ 40kbps స్పీడ్ ఉంటుంది.

BSNL రూ.99 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ (BSNL) రూ.99 ప్లాన్ 17 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 50MB డేటా అందిస్తుంది. డేటాను ఈజీగా వాడుకోవచ్చు. తక్కువ వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తుంటే ఈ BSNL ప్లాన్ తీసుకోవచ్చు.