Best Cars India : లైఫ్‌లో ఫస్ట్ టైం కారు కొంటున్నారా? సేఫ్టీ ఫీచర్లు, మైలేజీ అందించే బెస్ట్ కార్లు ఇవే.. మీ బడ్జెట్ ధరలోనే..!
Best Cars India : జీవితంలో మొదటిసారి కారు తీసుకుంటున్నారా? అయితే, మీకోసం మార్కెట్లో సేఫ్టీ ఫీచర్లతో పాటు మంచి మైలేజీ అందించే కార్లు ఉన్నాయి..

Best Cars India
Best Cars India : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో ఏ మోడల్ కారు కొంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? అయితే, మీరు ఫస్ట్ టైం కారు కొనుగోలు చేస్తుంటే మాత్రం ఇది మీకోసమే.. లైఫ్‌లో మొదటి కారును ఎంచుకోవడం బెస్ట్ మూమెంట్.. ఆఫీసుకు వెళ్లాలన్నా.. వారాంతపు సెలవులకు ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలన్నా సొంత కారు ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
అందుకే చాలామంది సొంత అవసరాలకు దూర ప్రయాణాలకు కొత్త కారు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 2025లో కారు తయారీదారులు అనుభవం లేనివారికి సరైన ధర, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లతో కూడిన బెస్ట్ మోడల్ కార్లను మార్కెట్లో అందిస్తున్నారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా భారత మార్కెట్లో లాంచ్ అయిన కారు మోడళ్లకు సంబంధించిన జాబితాను అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన కారు ఎంచుకుని కొనేసుకోవచ్చు. ఆ జాబితాను ఓసారి లుక్కేయండి..
మారుతి సుజుకి ఆల్టో K10 :
తక్కువ బడ్జెట్ ధరలో బెస్ట్ బడ్జెట్ బిగినర్స్ కారు. సుమారు రూ. 4 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో వస్తుంది. కాంపాక్ట్, ఫ్యూయల్ మైలేజీ 25 కిలోమీటర్ల వరకు నగరం లోపల నడపొచ్చు. బిగినర్స్‌కి బెస్ట్ మోడల్ కారు అని చెప్పొచ్చు. 2025 నాటికి డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, AMT ఆప్షన్‌తో వస్తుంది. బిగినర్స్ డ్రైవర్‌కు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది.
టాటా టియాగో :
టాటా టియాగో కారు ప్రీమియం, సరసమైన హ్యాచ్‌బ్యాక్ మోడల్. ఈ కారు మోడల్ ధర రూ. 5.6 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది, సేఫ్టీ కోసం 4-స్టార్ రేటింగ్ కలిగి ఉంది. యూజర్ ఫ్రెండ్లీగా బూట్ స్పేస్, టచ్‌స్క్రీన్, రివర్స్ కెమెరా, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి మోడ్రాన్ ఫీచర్లు, CNG, AMT వెర్షన్ అదనపు ఆప్షన్లు మరింత ఆకట్టుకునేలా ఉంటాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ :
కాంపాక్ట్ ఫార్మాట్‌లో SUV కోరుకునేవారికి హ్యుందాయ్ ఎక్స్‌టర్ బెస్ట్ మోడల్. దాదాపు రూ. 6 లక్షల ప్రారంభ ధరతో వస్తుంది. ఈ ఆటోమొబైల్ ఆకట్టుకునే డిజైన్, సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్యాక్ కెమెరా, గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. CNG ఆప్షన్ కూడా కలిగి ఉంది. నగరం లేదా చిన్న-పట్టణ హైవేలపై డ్రైవింగ్ చేసేందుకు వీలుగా ఉంటుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ :
మారుతి ఫ్రాంక్స్ SUV స్టైలింగ్, అధిక మైలేజీతో పాటు పవర్‌ఫుల్ ఇంజిన్ కలిగి ఉంది. టచ్‌స్క్రీన్, పుష్ స్టార్ట్ బటన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లతో వస్తుంది. రూ.7.5 లక్షల నుంచి లభ్యమవుతుంది.