Train Tickets Hike : ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. జూలై 1 నుంచి పెరగనున్న రైలు ఛార్జీలు.. కొత్త ఛార్జీలివే..?

Train Tickets Hike : COVID-19 మహమ్మారి తర్వాత భారత రైల్వే మొదటిసారిగా ప్రయాణీకుల రైలు ఛార్జీలను పెంచనుంది.

Train Tickets Hike : ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. జూలై 1 నుంచి పెరగనున్న రైలు ఛార్జీలు.. కొత్త ఛార్జీలివే..?

Train Tickets Hike

Updated On : June 25, 2025 / 3:43 PM IST

Train Tickets Hike : రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెల నుంచి రైలు ఛార్జీలు పెరగనున్నాయి. COVID-19 మహమ్మారి తర్వాత భారత రైల్వే మొదటిసారిగా ప్రయాణీకుల రైలు ఛార్జీలను పెంచనుంది. ఈ కొత్త ఛార్జీలకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది.

ఈ స్వల్ప ఛార్జీల పెరుగుదల జూలై 1, 2025 నుంచి అమలులోకి రానుంది. ముఖ్యంగా నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రయాణీకుల ఛార్జీ కిలోమీటరుకు ఒక పైసా పెరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏసీ క్లాసులకు
ఛార్జీల పెంపు కిలోమీటరుకు 2 పైసలు పెరగనుంది.

మెయిల్/ఎక్స్‌ప్రెస్ లేదా ఏసీ రైళ్లలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే.. రైలు ఛార్జీ ఎక్కువగా ఉంటుంది. కానీ, ప్రతిరోజూ లోకల్ రైలులో ప్రయాణించే ప్రయాణీకులకు ఎలాంటి మార్పు ఉండదు.

గతంతో పోలిస్తే.. స్వల్ప ఛార్జీల పెంపు :
దీనిపై రైల్వే అధికారి మాట్లాడుతూ.. ‘‘2020, 2013లో మునుపటి ఛార్జీల పెంపుతో పోలిస్తే.. ఈ పెరుగుదల అతి తక్కువ ఉండొచ్చు.

స్లీపర్ క్లాస్ ప్రయాణాలలో స్వల్ప పెరుగుదల ఉంటుంది’’ అని తెలిపారు. మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ క్లాస్ ఛార్జీ కిలోమీటరుకు ఒక పైసా పెరుగుతుంది. అన్ని ఏసీ తరగతుల (ఏసీ ఫస్ట్, సెకండ్, థర్డ్) ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసలు పెరుగుతాయి.

500 కి.మీ వరకు జనరల్ సెకండ్ క్లాస్ ఛార్జీలో ఎలాంటి పెరుగుదల ఉండదు. 500 కి.మీ కన్నా ఎక్కువ దూర ప్రయాణికులకు ఛార్జీని కిలోమీటర్‌కు అర పైసా పెంచవచ్చు.

నెలవారీ పాస్‌లు, రోజువారీ ప్రయాణికుల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే సబర్బన్ రైళ్ల ఛార్జీ పెరగదు. 2020, 2013 తో పోలిస్తే.. ఈసారి ఛార్జీలు అతి స్వల్పంగా పెరగనున్నాయి.

గతంలో, జనవరి 1,2020న రైలు ఛార్జీలను కి.మీ చొప్పున పెంచారు. ఆ తర్వాత ఆర్డినరీ, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సెకండ్ క్లాస్ ఛార్జీని వరుసగా 1 పైసా, 2 పైసా పెంచారు.

Read Also : Post Office Scheme : పోస్టాఫీస్ MIS రిటర్న్స్.. భార్యాభర్తలకు అద్భుతమైన పథకం.. ఇలా పెట్టుబడి పెడితే నెలకు రూ. 9,250 సంపాదించవచ్చు..!

స్లీపర్ క్లాస్, అన్ని ఏసీ కేటగిరీల ఛార్జీని వరుసగా 2 పైసా, 4 పైసా పెంచారు. స్లీపర్ క్లాస్ ఛార్జీని 6 పైసలు పెంచారు. 2013లో ఏసీ-2 మినహా అన్ని తరగతుల ఛార్జీలను కి.మీ.కు 10 పైసలు పెంచగా, ఏసీ-2 ఛార్జీని కి.మీ.కు 6 పైసలు పెంచారు.

  • సబర్బన్ ఛార్జీలలో ఎలాంటి పెరుగుదల ఉండదు.
  • నెలవారీ సీజన్ టికెట్ ధరలు మారవు.
  • జనరల్ సెకండ్ క్లాసులో 500 కి.మీ వరకు ఛార్జీల పెంపు ఉండదు.
  • జనరల్ సెకండ్ క్లాసులో కిలోమీటరుకు అర పైస చొప్పున ఛార్జీ పెరుగుతుంది.
  • మెయిల్, ఎక్స్‌ప్రెస్ (నాన్-ఏసీ) రైళ్లలో కిలోమీటరుకు 1 పైసా ఛార్జీ పెరుగుతుంది.
  • ఏసీ తరగతుల్లో కిలోమీటరుకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరుగుతాయి.

అదేవిధంగా, తత్కాల్ పథకం కింద టిక్కెట్లను ఆధార్ అథెంటికేషన్ కలిగిన ప్రయాణికులు మాత్రమే (IRCTC) వెబ్‌సైట్ / యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారిక నోటీసు పేర్కొంది.

జూలై 15, 2025 నుంచి తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు ఆధార్ ఆధారిత OTP అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.